దీపావళి పండగని పురస్కరించుకుని సెలబ్రెటీలు తమ అభిమానులకు జాగ్రత్తలు చెప్తూంటారు. మరికొంత మంది ఇంకో అడుగు ముందుకు వేసి పర్యావరణహిత దీపావళిని జరుపుకోండని  సలహాలు ఇస్తారు. అయితే అదే సమయంలో దీపావళి శుభాకాంక్షలు కూడా చెప్తూంటారు. అయితే దీపావళి పండగ శుభాకాంక్షలు చెప్పటానికి కూడా హాట్ గా తయారవ్వాలనే విషయం చెప్తోంది మాత్రం బాలీవుడ్ స్టార్ దిశాపటానీనే.

అక్కడితో ఆగిందా... ప్రఖ్యాత కెల్విన్ క్లెయిన్ బ్రాండ్ లో దుస్తుల్ని ధరించి  నవ్వులు చిందిస్తూ ఫోజ్ ఇచ్చింది. ఈ ఫొటో ఎంతలా  వైరల్ అయితే అంతలా కెల్విన్ క్లెయిన్ బ్రాండ్ కు ప్రచారం సాగుతుంది. అదీ అసలు అమ్మడి ఆలోచన. అంటే దీపావళిని అడ్డం పెట్టి డబ్బులు తీసుకుని ఇలా ఓ బ్రాండ్ పబ్లిసిటీ మొదలెట్టిందన్నమాట. ఈ పిల్ల తెలివితేటలు చూస్తూంటే ముచ్చట వేస్తోందో లేదో కానీ.. ఈ అతి వ్యవహారం చూసి జనాలు సోషల్ మీడియాలో తిట్ల వర్షం మాత్రం కురిపించేస్తున్నారు. 

మనదేశంలో ఎంతో గొప్పగా జరుపుకునే దీపావళి పండగ పేరు చెప్పి..ఇలా చేయటం ఏమీ పద్దతిగా లేదు. నీకు పబ్లిసిటీ కావాలంటే మరో విధంగా చేసుకోవచ్చు కదా...వేరే రోజుల్లో ఈ డ్రస్ వేసుకుని విషెష్ చెప్పచ్చు కదా. మేము చూడనన్నామా... దీపావళి  పండగను ఇలా నీ గ్లామర్ ప్రదర్శనతో కాలుష్యం చేయటం మానుకో అంటూ మందలిస్తున్నారు. ఈ ఫోటో పెట్టిన నాటి నుంచి ఆమె మీద మీద విమర్శలు వర్షం కురుస్తూనే ఉంది.