బాలీవుడ్‌లో  ఉన్న మంచి అందగత్తెల్లో దిశా పటానీ ఒకరు. అయితే ఆ అందం దిశాను స్టార్‌ హీరోయిన్‌ని చేయలేకపోయింది.  అప్పుడప్పుడూ బాలీవుడ్‌లో అడపాతడపా సినిమాలు చేస్తున్నా, దక్షిణాదిన మాత్రం పాగా వేయలేకపోయింది. తొలి సినిమా  ‘లోఫర్’ ఫ్లాప్‌ కావడంతో దిశా మరోసారి తెలుగులో నటించే ధైర్యం చేయలేదు. 

అయితే హీరోయిన్ గా  కంటే కూడా సోషల్ మీడియా వేదికగా అదిరిపోయే హాట్ ఫొటోస్ ని షేర్ చేస్తూ తన ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటూ వెళ్తోంది ఈ హాట్ బ్యూటీ. 21 మిలియన్ ఫ్యాన్స్ ని ఇనిస్ట్రగ్రమ్ లో కలిగి ఉన్న ఆమె అతి తక్కువ కాలంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకోసం ప్రత్యేకమైన ఫొటో షూట్స్ కు హాజరు అవుతోంది. 

రీసెంట్ గా సల్లూ భాయ్  చేసిన ‘భరత్’ విడుదల నేపథ్యం లో సినిమా ప్రమోషన్ కొరకు ఓ కార్యక్రమంలో పాల్గొన్న దిశా పటాని రకరకాల విషయాలపై చర్చించింది. తను సోషల్ మీడియా ఎక్కౌంట్ లో పంచుకునే ఫోటోలపై ఫ్యామిలీ మెంబర్స్ రెస్పాన్స్  ఎలా ఉంటుంది అనే విషయం పై ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

దిశా మాట్లాడుతూ...తన కుటుంబం తను చేసే సినిమా లను ఎప్పుడు గమనిస్తూ ఉంటుందని చెప్తోంది.  తను సినిమా లలో ఎలాంటి పాత్రలు చేసినా, అది నా వృత్తిలో భాగమే అని వాళ్ళకి తెలుసు అన్నారు. అయితే   పొట్టిబట్టల్లో హాట్ ఫొటోస్ ని సోషల్ మీడియా లో, వాళ్ళ ఫ్యామిలీ గ్రూపులో షేర్ చేసినప్పుడు మాత్రం వాళ్ళ నాన్న ఇబ్బందిగా ఫీలవుతారని చెప్తోంది. ఎంతైనా నాన్న కదా అంటుంది ఈ బ్యూటీ. ఇంస్టాగ్రామ్ లో తన ఫొటోస్ ని వాళ్ళ అమ్మ గారు, చూస్తారట కానీ, ఆ ఫొటోలు ఎవరితో పంచుకోవడానికి ఇష్టపడరట.