బాలీవుడ్ కుర్ర హీరోయిన్ దిశాపటానీ కొంతకాలంగా తన స్నేహితుడు టైగర్ ష్రాఫ్ తో ప్రేమాయణం సాగిస్తుందని బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తమ మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి వీరిద్దరూ ఓపెన్ గా చెప్పకపోయినా.. పబ్లిక్ ప్లేసెస్ లో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుండడంతో మీడియా పలు రకాల కథనాలను ప్రచురిస్తోంది.  

ఇది ఇలా ఉండగా.. రీసెంట్ గా ఈ జంట ముంబైలోని బస్టియన్ రెస్టారెంట్ కి వెళ్లింది. అయితే దిశా పటానీ బయటకి రాగానే.. కొన్ని ఫోటోలు క్లిక్ మనిపించి సోషల్ మీడియాలో పెట్టేశారు. దిశా రెస్టారంట్ కి వచ్చిందని తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో ఆమె చూడడానికి వచ్చారు.

అభిమానులంతా ఒక్కసారిగా దిశాపటానీ దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన టైగర్ తన బాడీగార్డ్స్ తో అక్కడకి వచ్చి.. రద్దీగా ఉన్న అభిమానుల నుండి  దిశాపటానీని కాపాడి తన కారులో ఎక్కించాడు.

దిశా, టైగర్ తరచూ బస్టియన్ రెస్టారంట్ కి వెళ్తుంటారు. ఇటీవల దిశా తన పుట్టినరోజు వేడుకలు టైగర్ తో కలిసి ఇదే రెస్టారంట్ లో అభిమానుల సమక్షంలో జరుపుకొంది.