బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ తన స్నేహితుడు టైగర్ ష్రాఫ్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయంపై ఈ ఇద్దరూ పెదవి మెదపడం లేదు. గతంలో టైగర్ ష్రాఫ్ తనకు కేవలం మంచి స్నేహితుడు మాత్రమేనని చెప్పే దిశా ఇప్పుడు అతడిని ఇంప్రెస్ చేయడానికి ఎంత ట్రై చేస్తున్నా పడడం లేదని అంటోంది.

టైగర్ తో ఉన్న అనుబంధం గురించి దిశా పటానీ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ''నీ కోసం జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నాను, బ్లాక్ ఫ్లిప్ చేశానని చెప్పినప్పటికీ తను ఇంప్రెస్ కావడం లేదు. ఇంకేం చేయాలి..? తను చాలా స్లో.. మేం కేవలం ఫ్రెండ్స్ లా కాకుండా మా రిలేషన్ షిప్ పెరగాలని కోరుకుంటున్నాను. నా శక్తిమేరకు అతడిని ఇంప్రెస్ చేస్తున్నా.. తను మాత్రం పడడం లేదు'' అంటూ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన 'భారత్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.