బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. సుశాంత్‌ మాజీ మేనేజర్‌కి సంబంధించి మరో విషయం వెల్లడైంది. ఆమె చనిపోవడానికి ముందు సుశాంత్‌కి ఫోన్‌ చేసినట్టు సుశాంత్‌ ఫ్రెండ్‌ వెల్లడించారు. దీంతో ఈ కేసులో మరో కోణం బయటకు వచ్చింది. ఇది మరింత ఉత్కంఠకి గురి చేస్తుంది. 

సుశాంత్‌ ఆత్మహత్య కేసుని సుప్రీంకోర్ట్ హైప్రొఫైల్‌ కేసుగా భావిస్తుంది. దీనిపై చాలా సీరియస్‌గా ఇన్వెస్టిగేషన్‌ చేయాలని పేర్కొంది. తాజాగా ఈ కేసుని కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో కొత్త విషయాన్ని సుశాంత్‌ ఫ్రెండ్‌ వెల్లడించారు. ఈ కేసుపై జాతీయ మీడియా సొంతంగా ఇన్వెస్టిగేషన్‌ చేస్తుంది. ఇందులో భాగంగా సుశాంత్‌ ఫ్రెండ్‌ పలు సంచలన విషయాలను పంచుకున్నారు. 

సుశాంత్ మాజీ మేనేజర్ దిశ సలియాన్ ఆత్మహత్యకి సుశాంత్ మృతికి సంబంధముందనే అనుమానాలు కలిగేలా అనేక విషయాలు బయటకొస్తున్నాయి. సుశాంత్ ఫ్రెండ్ చెబుతూ, సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సలియాన్ జూన్ 8న ఓ పార్టీలో పాల్గొందని, ఆ పార్టీలో జరిగిన గొడవలు ఆమె మరణానికి దారి తీసాయనే ఆరోపణలు వస్తున్నాయి. ముంబైలోని ఓ హోటల్ లో జరిగిన ఆ పార్టీ లో చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఆ క్రమంలో కొందరు దిశాని పెంట్ హౌస్ కు రమ్మని పిలిచారని, అందుకు ఆమె నిరాకరించిందని, ఆ తర్వాత దిశా సుశాంత్ కు ఫోన్ చేసిందని చెప్పాడు. 

సుశాంత్ తనతో మాట్లాడుతూ, దిశకు జరిగిన విషయాలను ప్రెస్ మీట్ పెట్టి బయట పెట్టాలని అనుకొన్నారు. తనతో మాట్లాడిన 22 నిమిషాల సంభాషణలో 50 సార్లు సందీప్ సింగ్ పేరు చెప్పారు. ప్రెస్ మీట్ పెట్టాలనుకున్న విషయం సందీప్ సింగ్ కు చెప్పారు` అని సుశాంత్ ఫ్రెండ్ వెల్లడించారు. సందీప్ సింగ్,  సిద్ధార్థ పితాని, రియా చక్రవర్తి ని విచారిస్తే సుశాంత్ మీడియాకు ఏం చెప్పాలనుకొన్నారనే విషయాలు తెలుస్తాయని అతను చెప్పుకొచ్చాడు. సుశాంత్‌ మరో కొత్త విషయం వెల్లడించడంతో కేసు విచారణలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ విచారణలో ఇంకా ఎన్ని సంచలన విషయాలు బయటకు వస్తాయో చూడాలి.