రవితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘డిస్కో రాజా’. పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌  హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి  వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌ తాళ్లూరి నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంభందించి రీసెంట్ గా హైదరాబాద్‌తోపాటు దిల్లీలో కీ సీన్స్ షూట్ చేసారు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు 2న ఫస్ట్‌లుక్‌ని విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.  అందుతున్న సమాచారం మేరకు డిసెంబర్ 20న రిలీజ్ కు రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ చిత్రం కథ ప్రకారం డిస్కో డాన్స్ లతో యూత్ కు కిక్ ఎక్కిస్తూ డిస్కోకింగ్ గా పేరు తెచ్చుకుంటాడు  రవితేజ . ఓ రోజు తన పోగ్రాం ముగించుకు వస్తూండగా...అనుకోకుండా ఓ అమ్మాయి కోసం ఓ రాజకీయ నాయకుడితో గొడవ పడాల్సి వస్తుంది. దీంతో వారిద్దరి మధ్య వైరం మొదలైంది. ఆ నెక్ట్స్‌ ఆ రాజకీయ నాయకుడు వేసిన స్కెచ్‌కి దీటుగా ఓ యాక్షన్‌ రిప్లై ఇచ్చే సమయంలో కోమాలోకి వెళ్తాడు రవితేజ. 

చాలా కాలం కోమాలో ఉండి బయిటకు వచ్చిన రవితేజ...ఆ రాజకీయ నాయకుడిపై రివేంజ్ తీర్చుకోవటానికి వచ్చేసరికి...బయిట ప్రపంచంలో పరిస్దితులు మారిపోతాయి. ఆ రాజకీయనాయకుడు ఇప్పుడు మినిస్టర్ స్దాయికి ఎదిగిపోతాడు. తనకా ఈ మధ్యకాలంలో వచ్చిన టెక్నాలజీ కానీ మరొకటి కానీ తెలియదు. అంతా మారిపోయింది. ఈ నేపధ్యంలో  రవితేజ ఏం చేస్తాడు..ఎంత డిఫరెంట్ గా తన రివేంజ్ తీర్చుకుంటాడు అనేది ‘డిస్కోరాజా’ సినిమా కథ అని తెలుస్తోంది. ఇదే కథ కాదా అనే విషయం తెలుసుకోవాలంటే మాత్రం కొంత సమయం వేచి ఉండక తప్పదు. 

‘‘వి.ఐ.ఆనంద్‌ విభిన్నమైన కథ,  స్క్రీన్ ప్లే తో రూపొందిస్తున్న చిత్రమిది. రవితేజ స్టైల్ లో ఎంటర్టైన్మెంట్  ఉంటూనే, ప్రేక్షకుల్ని ఆసక్తికి గురిచేసే అంశాలు ఉంటాయి’’ అని నిర్మాత రామ్‌ తళ్లూరి తెలిపారు.  ‘డిస్కో రాజా’ చిత్రంతో పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌ హీరోయిన్ పాత్రలు పోషిస్తున్నారు. వెన్నెల కిశోర్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.  బాబీ సింహా, వెన్నెల కిషోర్‌, సత్య, తాన్య హోప్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, మాటలు: అబ్బూరి రవి, ఛాయాగ్రహణం: సాయిశ్రీరామ్‌.