హీరోయిన్ గా క్లిక్ కాలేకపోయినా ... గ్లామర్ గాళ్‌గా సౌత్‌లో ఓ రేంజిలో క్రేజ్ తెచ్చుకుంది లక్ష్మిరాయ్. స్టార్ హీరోలతో ఐటెం సాంగ్స్‌తో చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మిగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కమెడియన్లు ప్రవీణ్, మధునందన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాను కొత్త దర్శకుడు కిషోర్ కుమార్ తెరకెక్కించాడు. హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన వెంకటలక్ష్మి బాగానే వర్కవుట్ అయ్యే అవకాసం ఉందని అంతా రిలీజ్ కు ముందు భావించారు. 

అయితే రిలీజ్ అయ్యాక టైటిల్ తగ్గ పరిస్దితే ఏర్పడింది..వేరీజ్ వెంకట్ లక్ష్మి అని వెతుక్కోవాల్సిన సిట్యువేషన్ క్రియేట్ అయ్యింది. సినిమా భాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ అయ్యింది. ప్రేక్షకులకు హర్రర్ అనుభవాన్ని మిగిల్చింది.  పర్శనల్ గా ఈ సినిమా మీద రాయ్ లక్ష్మి కూడా చాలా ఎక్సపెక్టేషన్స్ పెట్టుకుంది. దాంతో ఆమె చాలా నిరాశపడిందని సమాచారం.

ఈ సినిమాలో ఆమెది కీలకపాత్రే కావచ్చు కానీ సినిమా హీరోయిన్ మాత్రం కాదు. సినిమాలో లేటుగా ఆమె ఎంట్రీ ఇస్తుంది. ఆమెకన్నా కమిడియన్స్  ప్రవీణ్, మధు నందన్ లది పెద్ద రోల్. ఆ కామెడీ కూడా చాలా అవుట్ డేటెడ్ వ్యవహారం. ఆమె శృంగార ప్రదర్శన కొద్దిగా ఓ క్లాస్ ఆడియన్స్ కు రిలీఫ్ ఇచ్చింది. ఆమె హీరోయిన్ కాకపోయినా ...ఆ స్దాయిలో రాంగ్ ప్రమోషన్ చేసారు. ఆమె మీదే ట్రైలర్స్ కట్ చేసారు.

ఆమెనే పోస్టర్స్ వేసి క్రేజ్ తెచ్చారు. సినిమా చూడటానికి వెళ్లినవాళ్లకు అక్కడ ఆమె హీరోయిన్ గా కనిపించలేదు. రాయ్ లక్ష్మి కు పాత్ర చెప్పినప్పుడు అలాగే చెప్పారా..చెప్తే ఆమె తెలిసే ఒప్పుకుందా..అలా అయితే ఇందులో నిరాశపడాల్సింది ఏమీ లేదు. స్వయం కృతాపరాధమే అంటారు. దాని ఫలితం మాత్రం చాలా కాలం అనుభవించాల్సి ఉంటుంది.