బాలీవుడ్ కు వ్యాతిరేకంగా మాట్లాడాలన్నా.. బాలీవుడ్ లో జరిగే అన్యాయాలను ప్రశ్నించాలి అన్నా.. వినిపించే మొదటి రెండు పేర్లలో కంగనా రనౌత్ , వివేక్ అగ్నిహోత్రా పేర్లు వినిపిస్తాయి.
బాలీవుడ్ లో సమస్యలపై మాట్లాడాలి అన్నా.. ఎదురు ప్రశ్నించాలి అన్నా.. కాంట్రవర్సీలు ఫేస్ చేయాలి అన్నా.. అది కంగనా రనౌత్ తో పాటు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి మాత్రమే సాధ్యం. ముఖ్యంగా గత కొన్నాళ్ల నుంచి వేధిస్తున్న నెపోటిజం బాలీవుడ్ సినిమా మాఫియా గురించి, వాళ్ళు తీసే సినిమాల గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఇద్దరు ప్రశ్నిస్తూనే ఉంటారు. బాలీవుడ్ లో ఉన్న పలువురు టాప్ హీరోలు, నిర్మాతలని, వారి ఫ్యామిలీలని కొన్ని విషయాలలో విమర్శిస్తూనే ఉంటారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి.
దాంతో .. బాలీవుడ్ లో వీరిని కాస్త డిఫరెంట్ గా చూస్తుంటారు. మనం రామ్ గోపాల్ వర్మను ఎంత క్రేజీగా చూస్తామో.. బాలీవుడ్ లో వీళ్లిద్దరు అంత క్రేజీ అని చెప్పాలి. బాలీవుడ్ మాఫియాపై వీరు రెగ్యులర్ గా కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ఈక్రమంలో తాజాగా వివేక్ అగ్నిహోత్రి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దీంట్లో మరోసారి బాలీవుడ్ పై సంచలన కామెంట్లు చేశారు. బాలీవుడ్ మమ్మల్ని పట్టించుకోవడం లేదని.. దూరం పెట్టాయన్నారు.
బాలీవుడ్ లో కొంతమంది నన్ను, కంగనాని టార్గెట్ చేశారు. బాలీవుడ్ లో జరిగే.. సమస్యలను, తప్పులని మేమిద్దరమే ప్రశ్నిస్తాం కాబట్టి మమ్మల్ని దూరం పెడుతున్నారు. తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు మాకు ఉంది. అందుకే మా సినిమాలని, మమ్మల్ని టార్గెట్ చేసి, దూరం పెట్టి వేరు చేయాలనుకుంటున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు వివేక్ అగ్నిహోత్రి.
ఈసందర్భంగా వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ.. తన సినిమాలు ఇంకా ఎప్పుడు వస్తాయి.. అనే సందేహం వ్యాక్తం చేశారు. దాంతో ఆయన మాట్లాడుతూ.. నన్నైతే బాలీవుడ్ లో పూర్తిగా దూరం పెట్టింది అన్నారు. నాకు మధ్యతరగతి ప్రజల్లో, ఆడియన్స్ లో సపోర్ట్ వచ్చింది. కాని బాలీవుడ్ మాత్రం నన్ను దూరం పెట్టింది అన్నారు. ప్రస్తుతం ఉన్నబాలీవుడ్ సినిమాలు ముఖ్యంగా కరణ్ జోహార్ సినిమాలు వాస్తవానికి దూరంగా ఉంటాయి. వాళ్లు బయట దేశంలోని యూత్ మాత్రం బాలీవుడ్ సినిమాల్లో చూపించేంత వల్గర్ గా ఉండదు అన్నారు వివేక్.
ఒకప్పుడు సినిమాలు అందరూ చూసే విధంగా ఉండేవి. వెంటనే వాటికి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేవారు. ఇప్పటి సినిమాలకి కనెక్ట్ కావట్లేదు కాబట్టే ఎక్కువ ఫెయిల్యూర్స్ చూస్తున్నారు.. బాలీవుడ్ కు ఈ పరిస్థితి రావడానికి కారణం ఇదే అన్నారు. అందుకే ఆడియన్స్ అందుకే ఆడియన్స్ కూడా బాలీవుడ్ ని విమర్శిస్తున్నారని, బాయ్ కాట్ చేస్తున్నారని అన్నారు.
