'మనం', '24' రీసెంట్ గా 'హలో' వంటి సినిమాలను రూపొందించిన దర్శకుడు విక్రమ్ కె కుమార్ కి ప్రేక్షకుల్లో మంచి పేరే ఉంది. వైవిధ్యమైన కాన్సెప్ట్ లతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే ఈ దర్శకుడు తన తదుపరి సినిమా అల్లు అర్జున్ తో చేయాల్సివుంది కానీ కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లలేదు.

అయితే ఈ దర్శకుడు మంచి ఫామ్ లో ఉన్న సమయంలో అతడితో సినిమాలు చేయాలని నిర్మాత అశ్వనీదత్, మంజుల ఘట్టమనేని వంటి వారు అతడికి అడ్వాన్స్ లు ఇచ్చారు. విక్రమ్ కూడా వారితో సినిమాలు చేయాలనుకున్నాడు కానీ ఇప్పుడు సరైన ప్రాజెక్ట్ సెట్ కావడం లేదు. తాజాగా విక్రమ్ తో కలిసి పని చేయడానికి హీరో నాని ఒప్పుకున్నాడు.

కానీ నానికి ఉన్న కమిట్మెంట్ కారణంగా మరో బ్యానర్ లో ఈ సినిమా చేయాలనుకుంటున్నాడు. దీంతో నిర్మాత అశ్వనీదత్.. విక్రమ్ పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న  అశ్వనీదత్ దగ్గర విక్రమ్ చాలాసేపు సెటిల్మెంట్ కోసం మాట్లాడినట్లు తెలుస్తోంది.

ఫైనల్ గా అశ్వనీదత్ ని ఈ ప్రాజెక్ట్ లోకి ఏదో విధంగా తీసుకురావాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. మరి ఈ విషయం తెలిస్తే మంజుల ఘట్టమనేని సైలెంట్ గా ఉంటుందా..? లేక తను కూడా భాగస్వామ్యం కోరుతుందో చూడాలి!