గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు విక్రమ్ కె కుమార్ సక్సెస్ కొట్టేలా కనిపిస్తున్నాడు. అయితే ఇంటర్వ్యూలలో పెద్దగా పాల్గొనని విక్రమ్ మొదటిసారి చిత్ర యూనిట్ తో స్పెషల్ చిట్ చాట్ లో పాల్గొని ఒక కొత్త విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన ప్రతి సినిమాలో విక్రమ్ హీరోయిన్ పేరును ప్రియా అని సెట్ చేసుకుంటాడు. ఇది అందరికి తెలిసిన విషయమే. 

కానీ ఆ నేమ్ మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు అనే విషయం ఎవరికీ తెలియదు.  విక్రమ్ డైరెక్ట్ చేసిన 13బి - ఇష్క్ - మనం - 24 - హలో సినిమాల్లో హీరోయిన్ పేరు ప్రియా.  ఇక ఇప్పుడు గ్యాంగ్ లీడర్ లో కొత్త కథానాయిక ప్రియాంక పాత్రకి కూడా అదే పేరు. ఫైనల్ గా దీనివెనకున్న రహస్యం ఏమిటని నాని గ్యాంగ్ ఆరా తీయగా విక్రమ్ స్పందించాడు గాని ఫుల్ క్లారిటీ ఇవ్వలేదు. మొదట తాను స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు కామన్ గా ప్రతి ఫీమేల్ క్యారెక్టర్ కి ప్రియా అనే నేమ్ సెట్ చేస్తాను .అని చెప్పాడు. 

అయితే ఆ పేరు పెట్టడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉందని తనకు అది చాలా పర్సనల్ అని తెలిపారు. అంతే కాకుండా ఆ నేమ్ చాలా స్వీట్ గా ఉంటుందని అదే ప్రధానం కారణం అని కూడా విక్రమ్ తెలుపడం కొత్త రూమర్స్ ని క్రియేట్ చేసింది. ఇక చిత్ర యూనిట్ లో ఈ విషయం ఎవరికీచెప్పలేదని నాని అన్నారు. అయితే హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ మాత్రం తనకు ఆ సీక్రెట్ తెలుసనీ చెప్పింది. కానీ ఆ విషయం ఎవరితో చెప్పకూడదని దర్శకుడు చెప్పినట్లు వివరణ ఇచ్చింది. మరి ఆ సీక్రెట్ ఏమై ఉంటుందో.. ?