దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కి హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధించారు. ట్రాఫిక్‌ నిబంధనల ప్రకారం సోమవారం ఆయన కారుని ఆపి తనిఖీలు చేశారు.

టాలీవుడ్‌లో టాప్‌ డైరెక్టర్స్ లో ఒకరు త్రివిక్రమ్‌(Trivikram). మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు త్రివిక్రమ్‌ ట్రాఫిక్‌ పోలీసులకు దొరికిపోయాడు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్‌ చేశారు. ట్రాఫిక్‌ నిబంధనల ప్రకారం కార్ల అద్దాలకు బ్లూ ఫిల్మ్ ఉండకూడదు. కానీ త్రివిక్రమ్‌ ప్రయాణిస్తున్న కారుకి బ్లూ ఫిల్మ్ ఉండటంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఆయన కారుని ఆపివేశారు. ఆయన కారుని తనిఖీలు చేసి అద్దాలకు ఉన్న బ్లాక్‌ ఫిల్మ్ ని తొలగించారు. అంతేకాదు ట్రాఫిక్‌ రూల్స్ ఉల్లంఘించినందుకు జరిమానా కూడా విధించి పంపించారు. ప్రస్తుతం ఈ విషయంలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

 ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఇటీవల వరుసగా టాలీవుడ్‌ సెలబ్రిటీలు జరిమానాలు చెల్లించిన విషయం తెలిసిందే. ఇప్పటి టాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీల కార్లకు అధికారులు చలాన్లు విధించారు. వీరిలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, కల్యాణ్‌ రామ్, మంచు మనోజ్‌ ఉన్నారు. తాజాగా ఈ జాబితాలోకి త్రివిక్రమ్‌ కూడా చేరారు.

ఇక దర్శకుడు త్రివిక్రమ్‌ చివరగా అల్లు అర్జున్‌తో తీసిన `అల వైకుంఠపురములో` చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ని అందుకున్నారు. ఆ తర్వాత పవన్‌ కళ్యాణ్‌, రానాలు కలిసి నటించిన `భీమ్లా నాయక్‌` సినిమాకి మాటలు, స్క్రీన్‌ప్లే అందించారు. ఈ సినిమా సైతం హిట్‌ అయ్యింది. ఇప్పుడు మహేష్‌బాబుతో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. తర్వలోనే రెగ్యూలర్‌ షూటింగ్‌ జరుపుకోబోతుంది. 

`అతడు`, `ఖలేజా` వంటి సినిమాల తర్వాత చాలా గ్యాప్‌తో మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ లో వస్తోన్న మూడో చిత్రమిది. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాని ప్రకటించి కూడా చాలా రోజులవుతుంది. త్రివిక్రమ్‌ `భీమ్లా నాయక్‌`లో బిజీగా ఉండటంతో డిలే అవుతూ వస్తోంది. ఎట్టకేలకు త్వరలోనే రెగ్యూలర్‌ షూటింగ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు. వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నారు.