ఎస్ఎస్ఎంబి 28 మూవీపై ఆసక్తికర అప్డేట్ అందుతుంది. పూజా హెగ్డే కోసం త్రివిక్రమ్ ఒక లగ్జరీ కార్ ఏర్పాటు చేశారట. 

దర్శకుడు త్రివిక్రమ్ కి పూజా హెగ్డే చాలా స్పెషల్. ప్లాప్స్ లో ఉన్నప్పుడు ఆమెకు బ్రేక్ ఇచ్చాడు. వరుసగా మూడో సినిమాకు హీరోయిన్ గా తీసుకున్నారు. ఎస్ఎస్ఎబి 28లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. మహేష్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుందని సమాచారం. మేకర్స్ అసలు కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. ఒక ఇంటి సెట్ కోసం ఏకంగా రూ. 10 కోట్లు ఖర్చు చేశారట. ఈ హౌస్ సెట్స్లో కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారట. 

అయితే పూజా కోసం ఏకంగా నిర్మాతలతో ఒక లగ్జరీ కారు కొనిపించారట త్రివిక్రమ్. ఆమె ఎయిర్ పోర్ట్ నుండి హోటల్ కి హోటల్ నుండి సెట్స్ కి రావడానికి ఆ కార్ వాడతారట. సినిమా షూటింగ్ కోసం కూడా ఆ కార్ అవసరం ఉందట. అద్దెకు తీసుకోవడం కంటే కొనడమే బెటరని త్రివిక్రమ్ నిర్మాతలను ఒప్పించారట. టాలీవుడ్ లో ఇది హాట్ టాపిక్ అయ్యింది. పూజా హెగ్డేను త్రివిక్రమ్ అసలు కాలు క్రింద పెట్టనీయడం లేదని. ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాడని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

మరి షూటింగ్ అన్ని రోజులు చక్కర్లు కొట్టిన కారు కావాలని పూజా అడిగితే ఇచ్చేస్తాడేమో. కాగా అరవింద సమేత వీరరాఘవ చిత్రానికి ముందు పూజా కెరీర్ అద్వానంగా ఉంది. దాదాపు ఇండస్ట్రీ నుండి చెక్కేసే పరిస్థితి. ఆ టైం లో పిలిచి మరీ బంగారం లాంటి అవకాశం ఇచ్చారు. అరవింద హిట్ కొట్టగా, అల వైకుంఠపురంలో చిత్రంతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. మహేష్ మూవీలో మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడు. త్రివిక్రమ్-పూజాలకు ఎస్ఎస్ఎంబి 28 వరుసగా హ్యాట్రిక్ మూవీ. మహేష్ తో కూడా ఆయనకు హ్యాట్రిక్ చిత్రం. 

ఈ మూవీలో శ్రీలీల కూడా నటిస్తున్నట్లు సమాచారం. అధికారిక ప్రకటన అయితే జరగలేదు. ఓ పోలీస్ రోల్ కోసం బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ ని తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. థమన్ సంగీతం అందిస్తుండగా నాగవంశీ నిర్మిస్తున్నారు. ఆగస్టులో విడుదల చేయనున్నారని సమాచారం.