గతంలో అమలాపాల్ కూడా ఓ సినిమాలో ఇలానే నగ్నంగా నటించి షాక్ ఇచ్చింది. అయితే ఆ సినిమాకు జనాదరణ దక్కలేదు. కాకపోతే.. అమలాపాల్ నగ్నంగా నటించిందన్న వార్తలతో ఆ సినిమాకి మంచి హైప్ వచ్చింది. ఈసారీ అదే జరగొచ్చు అంటోంది ట్రేడ్.
దిల్ రాజు సినిమా అంటే ఫ్యామిలీలకు పండగ అన్నట్లు ఉంటాయి. ఆయన తన సినిమాలు క్లీన్ అండ్ నీట్ గా ఉండేలా చూసుకుంటాడు. అయితే డిస్ట్రిబ్యూటర్ గా మాత్రం ఆయన కాస్తంత స్పీడుగానే ఉంటున్నారు. క్రేజ్ ఉన్న డబ్బింగ్ సినిమాలను రిలీజ్ చేస్తున్న ఆయన రీసెంట్ గా విజయ్ హీరోగా చేసిన బీస్ట్ సినిమా రిలీజ్ చేసారు. ఇప్పుడు మరో తమిళ డబ్బింగ్ సినిమా రైట్స్ తీసుకున్నట్లు వినికిడి. అయితే ఆ సినిమాలో పదిహేను నిముషాల పాటు హీరోయిన్ ...ఒంటిమీద బట్టలు లేకుండా నగ్నంగా కనిపించనుందని టాక్. ఈ విషయం ఆ పాత్ర చేసిన హీరోయిన్ కూడా ఖరారు చేసింది.
కొంతమంది హీరోయిన్స్ కెరీర్ కోసం ఎంతటి రిస్క్ అయినా తీసుకోవడానికి వెనుకంజ వేయరు. బోల్డ్ గా కనిపించే అవకాశం వస్తే.. ఏమాత్రం ఆలోచించకుండా దూకేస్తారు. గ్లామర్ కోసం స్కిన్ షో చేయడం వేరు.. కథ డిమాండ్ చేస్తే... ఎంతటి క్లిష్టమైన సన్నివేశంలో అయినా నటించడానికి ఓకే చెప్పడం వేరు. ఆండ్రియా ఇప్పుడు అదే చేస్తోందని చెప్తోంది.
ఆండ్రియా ప్రధాన పాత్ర పోషించిన చిత్రం `పిశాచి 2`. మిస్కిన్ దర్శకత్వం వహించారు. ఇదో హారర్ సినిమా. గతంలో వచ్చిన పిశాచి 1 కు సీక్వెల్. ఈ సినిమాలో కథ ప్రకారం కొన్ని సన్నివేశాల్లో ఆండ్రియా నగ్నంగ కనిపిస్తుందిట. దానికి ఆండ్రియా ఒప్పుకుందని, దాదాపు 15 నిమిషాల పాటు.. ఆండ్రియా.. ఒంటిమీద బట్లల్లేకుండానే కనిపిస్తుందని తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయం నిజమే అని రీసెంట్ గా ఓ వెబ్ మీడియా కు ఇచ్చిన ఇంటర్వూలో రివీల్ చేసింది ఆండ్రియా. మొదట తాను ఇలాంటి పాత్ర చేయటానికి ఒప్పుకోలేదని..కానీ కథ విన్నాక ఖచ్చితంగా చెయ్యాల్సిన అవసరం ఉందనిపించిందని క్లారిటీ ఇచ్చింది. అయితే ఆ సన్నివేశాలు అసభ్యంగా, అభ్యంతరకరంగా లేకుండా మిస్కిన్ జాగ్రత్త పడే ఉంటారు.
గతంలో అమలాపాల్ కూడా ఓ సినిమాలో ఇలానే నగ్నంగా నటించి షాక్ ఇచ్చింది. అయితే ఆ సినిమాకు జనాదరణ దక్కలేదు. కాకపోతే.. అమలాపాల్ నగ్నంగా నటించిందన్న వార్తలతో ఆ సినిమాకి మంచి హైప్ వచ్చింది. ఈసారీ అదే జరగొచ్చు అంటోంది ట్రేడ్. ఆండ్రీయా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, పూర్ణ, కీలకపాత్రల్లో నటిస్తున్నారు. తెలుగులో శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాడు.