పవన్-రానా సినిమాలో గెస్ట్ పాత్రలో స్టార్ డైరక్టర్


ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, రానా ద‌గ్గుబాటి తొలిసారి ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్‌లో క‌లిసి న‌టిస్తున్న సంగతి తెలిసిందే. మ‌ల‌యాళ హిట్ చిత్రం `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. `అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు` ఫేమ్ సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రాన్ని సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఒకప్పటి స్టార్ డైరక్టర్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారని వినికిడి. ఆయన ఎవరూ అనేది ఎక్సపెక్ట్ చేసారా..

Director To Do A Cameo in Pawan Kalyan  Rana Film?  jsp

ఆ దర్శకుడు మరెవరో కాదు వివి వినాయిక్. ఆయన గతంలో తన దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన ఠాగూర్ సినిమాలో చిన్న గెస్ట్ రోల్ చేసారు. ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150 లో కనిపించారు. ఆ తర్వాత దిల్ రాజు నిర్మాతగా శీనయ్య టైటిల్ తో ఆయన హీరోగా సినిమా మొదలైంది. ఆ సినిమా పూర్తికాకుండానే ఆగిపోయింది. ఆయన ఇప్పుడు బెల్లంకొండ సురేష్ కుమారుడు బెల్లంకొండ సాయి ని హిందీలో ఛత్రపతి రీమేక్ తో పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర ఉంటే దాన్లో ఆయన కనిపించనున్నారు. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

 మరోవైపు వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి, వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా ఎంపికైంది. పవన్ కు సరసన ఆమె కనిపించనుంది. అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ సినిమా మళయాళం వెర్షన్‌లో బిజూమీనన్‌ పోలీస్‌ అధికారి పాత్రలో నటించగా ఆయన భార్య పాత్రలో గౌరీనందా  కనిపించింది. అభ్యుదయ భావాలు కలిగిన యువతిగా గౌరీనందా పోషించిన పాత్రకు సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలే లభించాయి. 

మళయాళంలో గౌరినందా నటించిన ఆ పాత్ర కోసం తెలుగు వెర్షన్‌లో సాయిపల్లవిని  ఎంపిక చేసారు. ఈ నేపధ్యంలో ఆమె అయితే  ఫెరఫెక్ట్ గా న్యాయం చేస్తుందని నిర్మాతలు నమ్మారు. దాంతో ఆమె ఓ రేంజిలో రెమ్యునేషన్ డిమాండ్ చేసిందని సమాచారం. సాయి పల్లవి రెండు కోట్లు డిమాండ్ చేసిందని, అయితే కొంత తగ్గించి నిర్మాతలు ఫైనల్ చేసారని చెప్పుకుంటున్నారు. అలాగే ఈ సినిమాలో రానాకు జోడీగా ఐశ్వర్య రాజేష్‌ చేస్తోంది. ఈ సినిమాకు ‘బిల్లా రంగా’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios