నిర్మాత సురేష్‌బాబు చిన్న కుమారుడు అభిరామ్‌ని హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు తేజ `అహింస` అనే సినిమాని రూపొందించారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్‌ టాక్‌ని తెచ్చుకుంది. అయితే ఈ సందర్భంగా తేజ వీడియో వైరల్‌ అవుతుంది.

దర్శకుడు తేజ టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌గా రాణించారు. కానీ ఇప్పుడు ఆయనతో సక్సెస్‌ దోబూచులాడుతుంది. చివరగా రానాతో `నేనే రాజు నేనే మంత్రి` సినిమాతో హిట్‌ అందుకున్నాడు. ఆ తర్వాత `సీత` సినిమాతో పరాజయాన్ని చవిచూశాడు. తాజాగా ఆయన నిర్మాత సురేష్‌ బాబు చిన్న కుమారుడు, రానా తమ్ముడు అభిరామ్‌ని హీరోగా పరిచయం చేస్తూ `అహింస` అనే సినిమాని తీశాడు. 

శుక్రవారం విడుదలైన ఈ సినిమా డిజాస్టర్‌ టాక్‌ని తెచ్చుకుంది. మొదటి షో నుంచే దీనికి నెగటివ్‌ టాక్‌ వచ్చింది. దీంతో ఇది మొదటి రోజు కనీసం నెట్‌ కూడా రాబట్టలేకపోయింది. జీరో నెట్‌ జాబితాలోకి చేరిపోయింది. ఇటీవల కాలంలో సినిమాలు బాగుందంటే ఆడుతున్నాయి, లేదంటే మొదటి షో నుంచే క్లీన్‌ స్వీప్‌ అవుతున్నాయి. `అహింస` సినిమా పరిస్థితి కూడా అదే. ఎప్పుడో `జయం` తరహా కథతో ఈ సినిమాని తెరకెక్కించాడని, హీరోగా అభిరామ్‌ ఏమాత్రం సెట్‌ కాలేదని, బాగా చేయలేదనే విమర్శలు వచ్చాయి. 

అయితే నిర్మాత సురేష్‌ బాబు రషెస్‌ చూసే ఈ సినిమా రిజల్ట్ చెప్పారట. దర్శకుడు తేజ ఇటీవల ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆ విషయాన్ని వెల్లడించారు. 90శాతం షూట్‌ అయ్యాక సురేష్‌బాబు వచ్చి ఓ రోజు రషెస్‌ చూశారట. ఆ తర్వాత బాగా చేయలేదు కదా ఆపేయకపోయారు, ఎందుకు తీశారని ప్రశ్నించారట. అయితే తాను రామానాయుడి కోసం, ఆయనకిచ్చిన మాట కోసం ఈ సినిమా తీశానని, డబ్బుల కోసం తీయలేదని చెప్పాడట. ఆ తర్వాత సురేష్‌బాబు కూడా ఎమోషనల్‌ అయి ఓకే చేయండి, ఎలాగైనా దీన్ని హిట్‌ చేయాలని చెప్పారట. 

Scroll to load tweet…

ప్రస్తుతం తేజ చెప్పిన ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. తన సినిమా ఫ్లాప్‌ అని ముందే చెప్పిన తేజ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సినిమా దొబ్బిందని వాళ్లకు క్లారిటీగానే ఉందని, టికెట్‌ కొని సినిమా చూసిన మనమే వేదవలమైపోయామని సినిమా చూసిన ఆడియెన్స్ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతుండటం గమనార్హం. ఇక ఈ చిత్రంలో అభిరామ్‌ సరసన గీతికా తివారీ నటించగా, జెమినీ కిరణ్‌ నిర్మించారు.