Asianet News TeluguAsianet News Telugu

తేజ `ష్‌.. స్టోరీస్‌` త్వరలోనే...


మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు...తేజ నిర్మాణంలో `ష్‌.. స్టోరీస్‌` అనే వెబ్ సిరీస్ తెర‌కెక్కుతోంది. ఈ సీరిస్ లో ఆరు లేదా ఏడు ఎపిసోడ్‌లు ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ కీ ఒక్కో ద‌ర్శ‌కుడు ద‌ర్శ‌క‌త్వం వ‌హించబోతున్నారు. వీళ్లంతా తేజ దగ్గర పనిచేసిన శిష్యులే అని తెలుస్తోంది. ఇక ఈ సీరిస్ లో ఒక్కో ఎపిసోడ్ 20 నుంచి 25 నిమిషాలు ఉంటుంద‌ని, ఇందుకోసం ఓ ఓటీటీ సంస్థ‌తో టైఅప్ అయ్యారని తెలుస్తోంది.

Director Teja Web Series titled sh stories
Author
Hyderabad, First Published Aug 10, 2020, 8:30 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

మొత్తానికి తేజ ఈ కరోనా సమయాన్ని బాగానే వినియోగించుకున్నారు. ఆయన మిగతా చాలా మంది సో కాల్డ్ డైరక్టర్స్ లా ..టైమ్ వస్తుందని, కరోనా వెళ్లిపోతుంది అని వెయిట్ చేయకుండా  వెబ్ సిరీస్ బాట ప‌ట్టారు. ఓటీటీ వేదిక‌ల ద్వారా.. ఆదాయాన్ని సంపాదించే మార్గం లోకి దూకేసారు. ఇప్ప‌టికే తన గురువు రాంగోపాల్ వ‌ర్మ మూడు సినిమాల్ని విడుద‌ల చేసి, మ‌రో మూడు సినిమాలు రెడీ చేస్తూ దూసుకుపోతున్నాడు. ఆ ప్రేరణతో నేమో తేజ కూడా అదే బాటలో అదే స్పీడులో పరుగెడుతున్నాడు.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు...తేజ నిర్మాణంలో `ష్‌.. స్టోరీస్‌` అనే వెబ్ సిరీస్ తెర‌కెక్కుతోంది. ఈ సీరిస్ లో ఆరు లేదా ఏడు ఎపిసోడ్‌లు ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ కీ ఒక్కో ద‌ర్శ‌కుడు ద‌ర్శ‌క‌త్వం వ‌హించబోతున్నారు. వీళ్లంతా తేజ దగ్గర పనిచేసిన శిష్యులే అని తెలుస్తోంది. ఇక ఈ సీరిస్ లో ఒక్కో ఎపిసోడ్ 20 నుంచి 25 నిమిషాలు ఉంటుంద‌ని, ఇందుకోసం ఓ ఓటీటీ సంస్థ‌తో టైఅప్ అయ్యారని తెలుస్తోంది.

మరో ప్రక్క తేజ ద‌ర్శ‌కత్వంలో ఓ వెబ్ సిరీస్ కూడా రూపొందించే ఆలోచ‌న వుంది. అందుకోసం ప్ర‌స్తుతం స్క్రిప్టు ప‌నులు కూడా మొద‌లైపోయాయి. ఆయన త్వరలో హాట్‌ స్టార్‌ కోసం వెబ్‌ సిరీస్‌లు చేసి పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.  

ఈ మేరకు ఓ వెబ్ సినిమా ని ఆయన తన శిష్యుడు తో కలిసి రూపొందించారట. ఆ శిష్యుడు పేరు రాజేష్. నైజాం ఏరియా బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ వెబ్ సినిమా ...పూర్తిగా బోల్డ్ గా కాస్తంత అడల్డ్ కంటెంట్ మిక్స్ చేసిన ఓ లవ్ స్టోరీగా సాగుతుందిట. ఆర్ ఎక్స్ 100 లాంటి వెబ్ సీరిస్ అంటున్నారు. అయితే ఇలాంటి వెబ్ సినిమాకు తన పేరు ఉండటం మంచిది కాదని భావించిన తేజ ..తన శిష్యుడు పేరుతో వచ్చే నెలలో రిలీజ్ చేయబోతున్నారట.

ఇక  తేజ ఈమధ్య షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్ళి రాగా ఆ తర్వాత వెబ్ సీరీస్ కు సంబందించిన పనులు చూస్తున్నారు. మొదటి ఎపిసోడ్ షూటింగ్ చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే కొద్దిగా సిమ్టమ్స్ రావడంతో ఎందుకైనా మంచిదని టెస్టులు చేయిస్తె కరోనా పాజిటివ్ వచ్చిందని తెలుస్తుంది.  తనకు కరోనా పాజిటివ్ వచ్చిందన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు డైరక్టర్ తేజ. తన టీమ్ లో కాని, కుటుంబ సభ్యులలో కాని ఎవరిక్ పాజిటివ్ రాలేదని చెప్పారు. ప్రస్తుతం హోమ్ క్వారెంటైన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు వెళ్లడించారు.

అలాగే త్వరలోనే సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతున్న అమెజాన్‌తో కలిసి తేజ ఓ సినిమా తెరకెక్కించనున్నట్లు చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికైతే తేజ దృష్టంతా ‘అలిమేలుమంగ వెంకట రమణ’, ‘రాక్షస రాజు రావణాసురుడు’ సినిమాలు పూర్తి చేయడంపైనే ఉన్నట్లు సమాచారం. ఈ రెండు చిత్రాల్లో ఒకదాన్ని హీరో రానాతో మరొకటి గోపీచంద్‌తో తెరకెక్కించనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios