టాలీవుడ్ దర్శకుడు తేజ ఎన్నో హిట్ చిత్రాలను డైరెక్ట్ చేశారు. ఆయన్ని దగ్గర నుండి చూసిన వారు ఆయనకి కాస్త కోపం ఎక్కువని, అసలు కంట్రోల్ చేసుకోలేరని చెబుతుంటారు. మరి ఇలాంటి మనిషి ఇంట్లో వాళ్లతో ఎలా ఉంటాడనే సందేహాలు రాకమానవు.

అయితే ఇంట్లో కూడా ఆయన తన కోపాన్ని ప్రదర్శిస్తుంటారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఒకసారి తినే పెరుగు బాగాలేదని తన భార్యతో గొడవ పడి విడాకులు తీసుకునే వరకు వెళ్లిందని అన్నారు. తనకు భోజనంలోకితప్పకుండా పెరుగు ఉండాలని, అలాంటిది ఇంట్లో వరుసగా మూడు రోజు పెరుగు బాగాలేకపోవడంతో తన భార్య శ్రీవల్లితో గొడవ పడినట్లు చెప్పారు.

ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో వ్యవహారం విడాకుల వరకు వెళ్లిందట. ఆ తరువాత పెద్దలు కల్పించుకోవడంతో గొడవ సద్దుమణిగిందని చెప్పారు. ఇప్పటికీ తన పిల్లలు పెరుగు కోసం విడాకులు ఇష్టానన్నావా అంటూ ఏడిపిస్తూ ఉంటారని చెప్పుకొచ్చారు. 

ఇటీవల తేజ డైరెక్ట్ చేసిన 'సీత' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం తేజ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నాడు.