నేనే రాజు నేనే మంత్రి తో  చాలా ఏళ్లకు హిట్టు కొట్టిన డైరెక్ట‌ర్ తేజ‌ ట్రెండ్ సెట్ట‌ర్ అయిన తేజ సక్సెస్ కోసం ప‌దేళ్లు క‌ష్ట‌ప‌డాల్సివ‌చ్చింది ఇప్పుడు మెగా హిరోతో సినిమాకి తేజ సిద్ద‌మ‌య్యాడు

దర్శకుడు తేజ చాలా ఏళ్ల తర్వాత ఓ హిట్టు కొట్టగలిగాడు. అప్పట్లో ట్రెండ్ సెట్టర్ అయిన తేజ.. తర్వాత కనీస మాత్రంగా ఆడే సినిమా కోసమే కష్టపడాల్సి వచ్చింది. ఎన్నేసి ఫ్లాపులు ఎదురైనా.. చివరకు నేనే రాజు నేనే మంత్రి అంటూ వైవిధ్యమైన కథ.. హీరో రోల్ తో సక్సెస్ సాధించాడు తేజ.

స్వయంగా కథ రాసుకునే ట్యాలెంట్ ఉన్న దర్శకుడు కావడంతో.. ఇపుడు తేజకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. పలు బడా ప్రొడక్షన్ హౌస్ లు కూడా తేజతో సినిమాకు సై అంటున్నాయి. ఇప్పటికే కొన్ని ఆఫర్స్ కూడా ఈ దర్శకుడి చెంతకు చేరినట్లు టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. అయితే.. స్టార్ హీరోలకు వీలైనంత వరకు దూరంగా ఉండే తేజ. ఇప్పుడు తన తర్వాత సినిమా ఎవరితో చేయనున్నాడనే పాయింట్ బాగా ఆసక్తి కలిగిస్తోంది.

ఈ విషయమై ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చేశాడట ఈ డైరెక్టర్. దగ్గుబాటి రానా మూవీ తర్వాత.. ఇప్పుడు మెగా కాంపౌండ్ లోకి తేజ చేరుతున్నాడని తెలుస్తోంది.దర్శకుల హీరో అనిపించుకుంటున్న వరుణ్ తేజ్ తో తన తర్వాతి సినిమాను ప్లాన్ చేసుకున్నాడట తేజ. ఇప్పటికే స్టోరీ లైన్ కూడా సెట్ అయిపోయిందని.. ప్రాజెక్టు కన్ఫాం అనుకున్నారని. ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకోవడంలో తేజ బిజీ కానున్నాడని టాలీవుడ్ లో మాటలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ మాంచి ఫీల్ బేస్డ్ లవ్ స్టోరీ చేస్తున్న వరుణ్ తేజ్.. అది పూర్తయిన వెంటనే తేజతో సినిమా స్టార్ట్ చేస్తాడని.. ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.