టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణా రెడ్డి కారుకు ట్రాఫిక్ పోలీసులు చలానా వేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించనందుకు ఆయనకు ఫైన్ వేశారు.  

టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణా రెడ్డి కారుకు ట్రాఫిక్ పోలీసులు చలానా వేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించనందుకు ఆయనకు ఫైన్ వేశారు. 

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించనందుకు టాలీవుడ్ సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కారుకు హైదరాబాద్‌ సుల్తాన్‌ బజార్‌ ట్రాఫిక్‌ పోలీసులు చలానా విధించారు. బ్యాంక్‌ స్ట్రీట్‌లో వెళ్తున్న ఎస్వీకృష్ణారెడ్డి బీఎండబ్ల్యూ కారును, అదే స్ట్రీట్ లో తనిఖీలు నిర్వహిస్తున్న సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీసులు చెక్ చేయగా..ఆయన కారు నెంబర్‌ ప్లేట్‌ సరిగా లేదని గుర్తించారు. 

ఇర్రెగ్యులర్‌ నెంబర్‌ ప్లేట్‌ ఉన్న కారణంగా ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ సుమన్‌ కుమార్‌ ఆ చలానా విధించారు. ఈ సందర్భంగా డిఫరెంట్ గా స్పందించారు ఎస్వీ కృష్ణారెడ్డి. , చాలా మంది సెలబ్రిటీలు విమర్షలు చేయాలి అని చూస్తారు, కాని కృష్ణా రెడ్డి మాత్రం తనదే తప్పు అని ఒప్పుకున్నారు. కారు నెంబర్‌ ప్లేట్‌ సరిచేసుకుంటానని పోలీసులకు చెప్పారు. 

అంతే కాదు ఇంత మండుటెండల్లో కూడా సక్రమంగా విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ పోలీసుల అంకితభావం అభినందనీయమని ఎస్వీ కృష్ణ రెడ్డి కొనియాడారు. ఎండా,వానా, చలిని లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసులను ఆయన అభినందించారు. టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించారు.

ఎస్వీ కృష్ణా రెడ్డి. కామెడీ సినిమాలతో పాటు సెంటిమెంట్ సినిమాలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సాధించాడు. డైరెక్టర్,ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్, రైటర్ గా మల్టీ టాలెంట్ చూపించారు ఎస్వీ కృష్ణ రెడ్డి. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి కొత్త నీరు రావడంతో.. ప్రస్తుతం సినిమాలు తగ్గించి.. అప్పుడుప్పుడు సినిమాలు చేస్తున్నారు.