సైరా నరసింహారెడ్డి చిత్రం తర్వాత సురేందర్ రెడ్డి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. స్వాతంత్ర ఉద్యమ వీరుడి కథని సురేందర్ రెడ్డి తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంది. మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. 

దీనితో సురేందర్ రెడ్డి తదుపరి చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. సురేందర్ రెడ్డి ఎలాంటి కథతో మన ముందుకు రాబోతున్నారనే ఉత్కంఠ సినీ అభిమానుల్లో నెలకొంది ఉంది. ఈ క్రమంలో సురేందర్ రెడ్డి జాబితాలో వరుణ్ తేజ్, ప్రభాస్ లాంటి హీరోలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

'తలైవి' టీజర్.. జయలలితగా కంగనా షాకింగ్ లుక్!

ఇదిలా ఉండగా తాజాగా టాలీవుడ్ లో ఓ ఆసక్తికర ప్రచారం మొదలైంది. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చిత్రం గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో ఘనవిజయం సాధించిన పింక్ చిత్ర రీమేక్ లో పవన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మించేందుకు దిల్ రాజు, బోనీ కపూర్ సిద్ధంగా ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 

తాజాగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని కలసినట్లు వార్తలు వస్తున్నాయి. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. పవన్, సురేందర్ రెడ్డి మధ్య ఈ మీటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పవన్ తో ఎలాగైనా సినిమా చేయాలని భావిస్తున్న దిల్ రాజు సురేందర్ రెడ్డిని రంగంలోకి దించి ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. 

పింక్ రీమేక్ కుదరకపోయినా.. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో పవన్ తో ఓ సినిమా తెరకెక్కించాలనేది ఆయన ప్లాన్. సురేందర్ రెడ్డి ఖాతాలో అద్భుతమైన విజయాలు ఉన్నాయి. రీసెంట్ గా సైరాలాంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించి ఆశ్చర్యపరిచారు. మరి పవన్ ఇప్పటికైనా తన రీఎంట్రీ చిత్రానికి పచ్చజెండా ఊపుతాడా లేదా అనేది వేచి చూడాలి.