స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ను దర్శకుడు విజయ్‌ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ‘తలైవి’ అనే పేరుతో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో కంగనా రౌనత్‌ నటిస్తోంది. తెలుగు, త‌మిళ‌, హిందీ బాష‌ల్లో ప్రతిష్టాత్మ‌కంగా రూపొందుతున్న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవల ప్రారంభ‌మైంది.

తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ని విడుదల చేశారు. జయలలిత ఓల్డ్ గెటప్ లో కంగనా రనౌత్ ఒదిగిపోయిందనే చెప్పాలి. అలానే టీజర్ లో జయలలితకి సంబంధించిన రెండు గెటప్ లను విడుదల చేశారు. అందులో ఒకటి జయలలిత యంగేజ్ లో హీరోయిన్ గా ఉన్న లుక్ ఒకటి కాగా.. తమిళనాడు ముఖ్యమంత్రి పాత్రకి సంబంధించిన లుక్ మరొకటి.

హీరోయిన్ కి గుండెపోటు.. పరిస్థితి విషమం!

ఈ సినిమా కంగన నాలుగు గెటప్‌ల్లో కనిపించనుంది. అందుకు సంబంధించి హలీవుడ్‌కు చెందిన ప్రముఖ మేకప్‌మెన్‌ జోసన్‌ కాలిన్స్‌ ని తీసుకొచ్చారు.  జయలలిత సినీపరిశ్రమకు రాకముందు, ఆ తరువాత సినీపరిశ్రమలో బిజీగా వున్న సమయంలో, తరువాత రాజకీయ అరంగేట్రం చేసినప్పుడు.

ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ఇలా నాలుగు గెటప్‌లలో కంగనను చూపించనున్నారు. ఈ సినిమాలో లెజెండరీ త‌మిళ‌నాడు దివంగ‌త రాజ‌కీయ నాయ‌కుడు ఎం.జి.రామ‌చంద్ర‌న్(ఎంజీఆర్‌) పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు అర‌వింద‌స్వామి నటిస్తుండగా.. దివంగ‌త మాజీ ముఖ్యమంత్రి క‌రుణానిధి పాత్రలో విల‌క్షణ న‌టుడు ప్రకాష్ రాజ్ కనిపించనున్నాడు.

విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్‌.సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి విశాల్ విట్టల్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.