ఒక సినిమాను విమర్శించడానికి, అభ్యంతరం చెప్పడానికి చాలా తేడా ఉంటుందన్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. తన తాజా చిత్రం కబీర్ సింగ్ కు  కొందరు రెండు స్టార్స్ మాత్రమే ఇచ్చారని చెప్పుకొచ్చారు. కానీ తెలివైన ప్రేక్షకులు ఈ సినిమాకు మాత్రం రూ.200 కోట్లు కట్టబెట్టారని చెప్పుకొచ్చాడు.

మీ క‌న్నా మా తెలుగువాళ్లే మంచోళ్లు. అక్క‌డా సినిమాకు మంచి రేటింగ్స్ రాక‌పోయినా క‌నీసం టెక్నిక‌ల్ అంశాల గురించి ఎనాల‌సిస్ చేసి బాగా రాసారు. క‌బీర్ సింగ్ విష‌య‌సంలో అదీ జ‌ర‌గ‌లేదు.  .  సినిమాకు సంబంధించి అ,ఆలు తెలియని వాళ్లు కూడా క్రిటిక్స్ అవతారం ఎత్తడం ప్రమాదకరమని వ్యాఖ్యానించాడు.
 
ఇక తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్‌ రెడ్డి సి రీమేక్‌తో బాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు సందీప్. షాహిద్‌ కపూర్‌ హీరోగా కబీర్‌ సింగ్ పేరుతో రిలీజ్ అయిన అర్జున్‌ రెడ్డి రీమేక్‌ బాలీవుడ్‌లోనూ రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది.

అయితే ఈ సినిమాపై బాలీవుడ్ సినీ విమర్శకులు మాత్రం పెదవి విరిచారు. ముఖ్యంగా సినిమాలో మహిళలను తక్కువగా చూపించారని, హీరో పాత్రను ఎలాంటి గమ్యం లేకుండా కేవలం ఓ తాగుబోతుగా, తన మీద కంట్రోల్‌ లేని వ్యక్తిగా చూపించారని విమర్శించారు.  

ఈ సందర్భంగా ఫిలిం కంపానియన్‌ యూట్యూబ్‌ చానల్‌తో మాట్లాడిన సందీప్ రెడ్డి వంగా క్రిటిక్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన సినిమాను విమర్శించే వారంతా సూడో స్త్రీవాదులంటూ విమర్శించాడు. 

సం‍దీప్‌ ఇంటర్య్వూపై స్పందించిన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ, ‘ సందీప్‌ రెడ్డి వంగా అమాకత్వంతో కూడిన నిజాయితీ, నిజమైన ధైర్యం కలిగిన వ్యక్తి. కబీర్‌ సింగ్‌పై ఆయన తాజా ఇంటర్వ్యూ ఓ సంచలనం’ అంటూ ట్వీట్ చేశారు.