మహేష్ తో అనుకున్న సినిమా ముందుకు వెళ్లలేదు. ఊహించని విధంగా అల్లు అర్జున్ తో సినిమా ముందుకు వచ్చింది. అలాగని అది వెంటనే ప్రారంభమయ్యే పరిస్దితి కనపడటం లేదు. ఏదో ఎనౌన్సమెంట్ అయితే వచ్చింది కానీ టైమ్ పట్టేటట్లు ఉంది. మరి ఈ గ్యాప్ లో ఏం చేయాలి. సుకుమార్ ముందున్న ప్రశ్న ఇది. ఓ క్రియేటివ్ పర్శన్ గా ఆ గ్యాప్ ని భరించటం కష్టమే..అందుకే ఆయన..తన రూట్ ని మార్చాలని డిసైడ్ చేసుకున్నారు. 

బాలీవుడ్ కు వెళ్లి అక్కడ ఇండస్ట్రీని ఏలాలనేది సౌత్ హీరోయిన్స్ కల అయితే, సౌత్ డైరక్టర్స్ కు అక్కడ సినిమా దర్శకత్వం వహించి హిట్ కొట్టాలనేది కోరిక. సుకుమార్ కు కూడా అలాంటి కోరిక ఉందట. ఆయనకు ఓ హిందీ సినిమా డైరక్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఆ మధ్యన సుకుమార్.. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ అండతో ..బాలీవుడ్ స్టార్స్ అయిన ఖాన్స్ ని కలసి కథ చెప్దామనుకున్నారు.

అయితే ఆ తర్వాత మహేష్ తో సినిమా స్క్రిప్టు బిజీలో పడిపోయి ఆ ఆలోచనను ప్రక్కన పెట్టేసారు. ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమా అనుకున్నా అది లేటు అయ్యేటట్లు ఉంది. త్రివిక్రమ్ తో బన్ని సినిమా పూర్తయ్యాకే సుకుమార్ సినిమా స్టార్ట్ అయ్యేది. దాంతో ఈ గ్యాప్ లో బాలీవుడ్ ట్రైల్స్ వేస్తే..అల్లు అర్జున్ తో సినిమా పూర్తయ్యే నాటికి ఓ కొలిక్కి వస్తుందని సుకుమార్ భావిస్తున్నారట. 

దాంతో  సుకుమార్‌  పూర్తిగా బాలీవుడ్‌ పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. తను తీసిన సినిమాల్లో  హిట్ ని అక్కడ రీమేక్ చేయాలని భావిస్తున్నారట. విజయేంద్రప్రసాద్ ఆ సినిమాని సమర్పించనున్నారు. నాన్నకు ప్రేమతో సినిమా రీమేక్ అయ్యే అవకాసం ఉందని సమాచారం.  ఈ మేరకు రెండు మూడు సార్లు బోంబేకి కూడా వెళ్లివచ్చారని సమాచారం.. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో ఖాన్‌ త్రయాన్ని కలుసుకుని తన  సినిమాల స్టోరీ లైన్స్ చెప్పే పనిలో ఉన్నారంటున్నారు.  అంటే మరో తెలుగు దర్శకుడు బాలీవుడ్ లో విజయ పతాకం ఎగరవేయబోతున్నాడన్నమాట.