. పుష్ప సినిమా భారీ విజయం సాధించడంతో పుష్ప 2పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే దర్శకుడు


‘పుష్ప’కి పార్ట్ 2 గా రెడీ అవుతున్న పుష్ప రూలింగ్ సినిమా నుంచి రిలీజ్ చేసిన తాజా వీడియో మాత్రం ఇప్పుడు మీడియా వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది.ఈ వీడియోలో పుష్ప ఎక్కడ అనేది ముఖ్యంగా హైలైట్ చేయటం వెనక సుకుమార్ స్ట్రాటజీ ఉందంటున్నారు. ‘వేర్ ఈజ్ పుష్ప’ అనే ఓ ప్రశ్నను జనాల్లోకి పంపి డిస్కషన్ కు తెర తీయాలనేది దర్శకుడు సుకుమార్ ఆలోచన అని, ఆ విషయంలో వంద శాతం సక్సెస్ అయ్యారని అంటున్నారు.

వాస్తవానికి పాన్ ఇండియా సినిమాలకు బీజం వేసిన బాహుబలి సినిమాలో కూడా బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే విషయాన్ని ఎక్కువగా హైలైట్ చేశాడు దర్శకుడు రాజమౌళి. ఇప్పుడు పుష్ప 2 సినిమా విషయంలో కూడా పుష్ప ఎక్కడ ఉన్నాడు? అనే విషయాన్ని హైలైట్ చేస్తూ దర్శకుడు సుకుమార్ టీజర్ వదిలారు. ఎందుకంటే ఇలాంటి ప్రశ్నను జనాల్లోకి తీసుకువెళ్తే కచ్చితంగా అందరూ మాట్లాడుకుని, చివరకు థియేటర్ల వరకు వస్తారని నమ్ముతున్నట్టు చెబుతున్నారు. ‘పుష్ప’ సెకండ్ పార్ట్ లో పుష్ప కి ఏమైయింది ?ఎందుకు వెతుకుతున్నారు... ఎక్కడి వెళ్ళాడు ? వెతకాల్సిన పరిస్దితులు ఏమి వచ్చాయి అనే క్యురియాసిటీని అయితే కలిగించగలిగాడు సుకుమార్.

ఇక పుష్ప సినిమా క్రేజ్ అంతా ఇంతా కాదు. అంతర్జాతీయంగా పుష్ప మేనియా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు పుష్ప 2 పై అందరి దృష్టి నెలకొన్న నేపధ్యంలో ఊహించని రూపంలో పుష్ప కథలో ములుపులు ఉండనున్నాయని తెలుస్తోంది. పుష్ప సినిమా భారీ విజయం సాధించడంతో పుష్ప 2పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే దర్శకుడు సుకుమార్ అండ్ టీమ్ తీవ్రంగా కష్టపడుతోంది. అంచనాలు భారీగా పెరగడంతో అనుకున్నదానికంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. స్క్రిప్టును మరింత కట్టుదిట్టంగా తీర్చిదిద్ది తెరకెక్కిస్తున్నారు.

ఇక సినిమాని నార్త్ లో కూడా ప్రేక్షకులు మరింత ఆదరించే విధంగా రూపొందించాలని మేకర్స్ భావిస్తున్న నేపథ్యంలో నార్త్ నుంచి ఒక పేరు ఉన్న హీరోని గెస్ట్ రోల్ లో దింపాలని భావిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అందులో భాగంగానే సుకుమార్ అండ్ టీం బాబీ డియోల్ ని సంప్రదించగా ఆయన కథ విని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆ విషయమై ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు.