బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ ఎమోషనల్‌ అయ్యాడు. తన శిష్యుడు తొలి సినిమాతోనే బ్లాక్‌ బస్టర్‌ కొట్టడంతో భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్బంగా ఓ ఎమోషనల్‌ పోస్ట్ పెట్టాడు. ఇప్పుడీ పోస్ట్ అభిమానులను సినీ వర్గాలను కదిలిస్తుంది. అది ఎవరికో కాదు `ఉప్పెన` చిత్రంతో సూపర్‌ హిట్‌ అందుకున్న బుచ్చిబాబు సానాని ఉద్దేశించి. 

బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ ఎమోషనల్‌ అయ్యాడు. తన శిష్యుడు తొలి సినిమాతోనే బ్లాక్‌ బస్టర్‌ కొట్టడంతో భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్బంగా ఓ ఎమోషనల్‌ పోస్ట్ పెట్టాడు. ఇప్పుడీ పోస్ట్ అభిమానులను సినీ వర్గాలను కదిలిస్తుంది. అది ఎవరికో కాదు `ఉప్పెన` చిత్రంతో సూపర్‌ హిట్‌ అందుకున్న బుచ్చిబాబు సానాని ఉద్దేశించి. వైష్ణవ్‌ తేజ్‌, కృతి శెట్టిలను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ, తాను దర్శకుడిగా పరిచయం అవుతూ బుచ్చిబాబు `ఉప్పెన` సినిమాని రూపొందించిన విషయం తెలిసిందే. 

ఈ సినిమా ఈ నెల 12న విడుదలై సూపర్‌ హిట్‌గా దూసుకుపోతుంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే యాభై కోట్ల గ్రాస్‌ని కలెక్ట్ చేసి టాలీవుడ్‌ వర్గాలను షాక్‌కి, ఆశ్చర్యానికి గురి చేస్తుంది. బుచ్చిబాబు దర్శకుడు శిష్యుడు, తన సుకుమార్‌రైటింగ్స్ లోనే పరిచయం అయ్యారు. సుకుమార్ తరహాలోనే `ఉప్పెన` రూపంలో ఓ విభిన్నమైన, సాహసోవంతమైన, అందమైన ప్రేమకథను ఓ ప్రేమకావ్యంలా మలిచాడు.ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ.. వసూళ్ల సునామీతో దూసుకుపోతుంది. బుచ్చిబాబు నాపెద్ద కొడుకు, నేను పుత్రోత్సహాంలో వున్నాను.. అంటూ వేదికపై చెప్పిన దర్శకుడు సుకుమార్ బుచ్చిబాబుకు ప్రేమతో రాసిన ఓ లేఖ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 

`నువ్వు నన్ను గురువును చేసే సరికి... నాకు నేను శిష్యుడినై పోయాను. ఇంత గొప్ప సినిమా తీయడానికి నువ్వు నా దగ్గర ఏం నేర్చుకున్నావా...?? అని.. నాకు నేను శిష్యుడిని అయిపోతే తప్ప అదేంటో తెలుసుకోలేను. నాలోకి నన్ను అన్వేషించుకునేలా చేసిన సానా బుచ్చిబాబును ఉప్పెనంత ప్రేమతో అభినందిస్తూ.. ఇట్లు సుకుమార్ ఇంకో శిష్యుడు - సుకుమార్` అంటూ సకుమార్ రాసిన ఈ లేఖ అందరిని అలరిస్తుంది. ఓ శిష్యుడి పట్ల గురువుగారి ప్రేమను చూసి అందరూ సుకుమార్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ నోట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

View post on Instagram