Asianet News TeluguAsianet News Telugu

తగ్గే ప్రసక్తే లేదు.. క్లారిటీ ఇచ్చేసిన సుకుమార్!

పుష్ప సినిమాను 100 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌ లో రూపొందించేందుకు ప్లాన్ చేశారు. కానీ బడ్జెట్‌ ను తగ్గించుకునేందుకు చిత్రయూనిట్ గట్టిగానే ప్రయత్నించిందట. కానీ ఏ విషయంలోనూ కాంప్రమైజ్‌ అయ్యే పరిస్థితి లేకపోవటంతో సుకుమార్ 100 కోట్లకే బడ్జెట్‌ను ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది.

Director Sukumar Clarity on Allu Arjun Pushpa Budget
Author
Hyderabad, First Published Aug 18, 2020, 7:58 AM IST

ఏడాది ప్రారంభంలోనే అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ మూవీ తరువాత సుకుమార్ దర్శకత్వంలో పాన్ సినిమాను ఎనౌన్స్‌ చేశాడు. మాస్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉన్నా కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా పడింది. పరిస్థితులు సెట్ అయిన వెంటనే సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.

అయితే కరోనా కారణంగా సినిమా ఆలస్యం కావటంతో పాటు పరిస్థితులు పూర్తిగా మారిపోవటంతో చాలా మంది ఫిలిం మేకర్స్ సినిమా బడ్జెట్ విషయంలో ఆలోచన చేస్తున్నారు. అయితే అదే ఆలోచన పుష్ప టీం కూడా చేసిందట. ముందుగా ఈ సినిమాను 100 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌ లో రూపొందించేందుకు ప్లాన్ చేశారు. కానీ బడ్జెట్‌ ను తగ్గించుకునేందుకు చిత్రయూనిట్ గట్టిగానే ప్రయత్నించిందట.

కానీ ఏ విషయంలోనూ కాంప్రమైజ్‌ అయ్యే పరిస్థితి లేకపోవటంతో సుకుమార్ 100 కోట్లకే బడ్జెట్‌ను ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్‌ లారీ డ్రైవర్‌ పాత్రలో నటిస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. బన్నీ సరసన రష్మీక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios