Rajamouli : రాజమౌళికి మరో గౌరవం.. ‘ఐఎస్ బీసీ’ చైర్మన్ గా జక్కన్న! డిటేయిల్స్
దర్శకధీరుడు రాజమౌళికి అరుదైన గౌరవం దక్కింది. ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఆరుగురు సభ్యులు అకాడెమీ జ్యూరీ మెంబర్లుగా ఎంపికైన తర్వాత.. జక్కన్న అభిమానులకు శుభవార్త అందింది.
‘బాహుబలి’,’ఆర్ఆర్ఆర్’ తర్వాత ఇండియన్ టాప్ డైరెక్టర్, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) ని ప్రపంచం మొత్తం చూస్తోంది. ఆయన ప్రతిభను ఏదోలా ప్రశంసలు అందుతూనే ఉన్నాయి. జక్కన్న తెరకెక్కించిన RRRకు వరల్డ్ వైడ్ గా ఆడియెన్స్ ఫిదా అయిన విషయం తెలిసిందే. హాలీవుడ్ దిగ్గజ దర్శకులు, నటీనటుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. అలాగే ప్రతిష్టాత్మకమైన Oscar Award కూడా వరించింది.
ఆ గొప్ప విజయం తర్వాత.. ‘ఆస్కార్‘ జ్యూరీ కమిటీ నుంచి ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ లోని ఆరుగురికి ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి, సాబు సిరిల్, సెంథిల్, చంద్రబోస్ లను జ్యూరీ మెంబర్లుగా ఎంపికచేయడం మరోసారి ఇండియన్స్ ఆనందంలో ముంచింది. కానీ రాజమౌళి పేరు లిస్టులో లేకపోవడంతో కొందరు అప్సెట్ అయ్యారు.
తాజాగా ఎస్ఎస్ రాజమౌళి అభిమానులకు శుభవార్త అందింది. జక్కన్నను ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్ (ISBC ) చైర్మన్ గా నియమిస్తూ సంస్థ ప్రకటన విడుదల చేసింది. గ్రామీణ స్థాయిలోని క్రికెటర్ల ప్రతిభను ప్రపంచానికి చూపించేందుకు మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్ సర్కార్ ఆధ్వర్యంలో ఐఎస్బీసీ ఏర్పాటైంది. ఇప్పటికే రాజమౌళి కొడుకు కార్తికేయ ఐఎస్ బీసీ జాయింట్ సెక్రెటరీగా ఉన్నారు. ఇక త్వరలో జక్కన్న కూడా చైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇప్పటి వరకు భారీ చిత్రాలను తెరకెక్కిస్తూ అద్భుతాలు సృష్టించిన రాజమౌళి.. ఇక పై బాల్ అండ్ బాట్ పట్టుకొని క్రీడారంగంలోనూ మెరుగైన సేవలు అందిస్తారని నమ్ముతున్నారు. టాలెంట్ ఉన్న వారికి అవకాశం కల్పించడమే ఐఎస్ బీసీ ప్రధాన లక్ష్యమని ఇప్పటికే ఫౌండర్, సీఈవో కే సునీల్ బాబు చెప్పిన విషయం తెలిసిందే. ఐఎస్ బీసీ ద్వారా 25 కోట్ల మంది విద్యార్థులను పలు టీమ్ లుగా ఏర్పాటు చేసి టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. జక్కన్న రీసెంట్ గా ప్రముఖ ఫోన్ కంపెనీ ఒప్పో (Oppo)కి బ్రాండ్ అంబాసిడర్ గానూ ఎంపికైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి యాడ్ షూట్ కూడా చేశారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. త్వరలో చిత్రం పూజాకార్యక్రమాలు జరగనున్నాయి. SSBM29గా రాబోతున్న ఈ చిత్రం యాక్షన్ అండ్ అడ్వేంచర్ గా రూపుదిద్దుకోనుంది. విజయేంద్ర ప్రసాద్ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నారు.