తన సినిమాలలో కామెడీ ఎపిసోడ్లకు పెద్ద పీట వేస్తుంటాడు దర్శకుడు శ్రీనువైట్ల. 'దుబాయి శీను','రెడీ','దూకుడు','బ్రూస్ లీ' ఇలా ప్రతి సినిమాలో కమెడియన్ల కోసం స్పెషల్ ట్రాక్ లు పెడుతూ సెటైర్లు వేస్తుంటారు. రీసెంట్ గా ఆయన డైరెక్ట్ చేసిన సినిమా 'మిస్టర్' ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. 

అందులో కూడా కమెడియన్ పృధ్వీ పాత్రతో దర్శకులపై సెటైర్లు వేశాడు. ఈసారి కూడా తను డైరెక్ట్ చేస్తోన్న 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలో ఓ సెటైరికల్ ఎపిసోడ్ ని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

అమెరికాలో నాటా, తానా అనే తెలుగు అసోసియేషన్లు ఉన్నాయి. ఈసారి వాటిని టార్గెట్ చేస్తూ 'వాటా' అనే పేరుతో హిలారియస్ ఎపిసోడ్ ని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ రెడ్డి, సునీల్, వెన్నెల కిషోర్, సత్య, రఘుబాబు ఇలా కామెడీ గ్యాంగ్ మొత్తం ఈ ఎపిసోడ్ లో కనిపించనుంది. ఈ ఎపిసోడ్ నవ్వులు పూయిస్తుందని అంటున్నారు.

సినిమా వాళ్లపై కూడా సెటైర్లు వేసినట్లు సమాచారం. ఈ సినిమా థ్రిల్లర్ నేపధ్యంలో సాగుతున్నప్పటికీ శ్రీనువైట్ల మార్క్ కామెడీ కోసం ఈ స్పెషల్ ట్రాక్ ని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 16న సినిమా పేక్షకుల ముందుకు రాబోతుంది.  మరి ఈ సినిమాతోనైనా శ్రీనువైట్ల సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి!

ఇది కూడా చదవండి.. 

జెన్నిఫర్ లోపేజ్ బెడ్ పై పడుకున్నా: శ్రీనువైట్ల!