చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నేషనల్ అవార్డు విన్నింగ్ చిత్రానికి దర్శకత్వం వహించిన ఎస్ పి జననాధన్ అకాల మరణం పొందారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో నేడు జననాధన్ మరణించడం జరిగింది. 61ఏళ్ల జననాధన్ అనారోగ్యం బారినపడంతో  చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించడం జరిగింది. జననాధన్ ఆరోగ్యం విషమంగా ఉండడంతో ఐసీయూ లో ఉంచి డాక్టర్స్ చికిత్స అందిస్తున్నారు. 


అయితే జననాధన్ కు గుండెపోటుకు గురయ్యారని, దానితో డాక్టర్స్ ఆయనను కాపాడలేకపోయారని సమాచారం. జననాధన్ మరణవార్త కోలీవుడ్ చిత్ర వర్గాలను విషాదంలో నింపింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రముఖులు కోరుకుంటున్నారు. అలాగే ఆయన కుటుంబానికి   సంతాపం తెలియజేస్తున్నారు. 2003లో వచ్చిన ఇయరకై తమిళ మూవీతో దర్శకుడుగా మారారు జననాధన్. ఆ చిత్రం ఫీచర్స్ ఫిలిమ్స్ విభాగంలో జాతీయ అవార్డు అందుకుంది. 


నిర్మాతగా కూడా ఒక చిత్రాన్ని జననాధన్ నిర్మించారు. ప్రస్తుతం ఆయన విజయ్ సేతుపతి హీరోగా లాభం అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. ఇంతలోనే జననాధన్ మరణించడం విషాదకరం. చెన్నైలో నేడు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారని సమాచారం.