ప్రముఖ యష్ రాజ్ ఫిలిం సంస్థ నిర్మాణంలో వార్ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం కోసం దాదాపుగా 200 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ పోటాపోటీగా తలపడనున్నారు. కళ్ళు చెదిరే స్టంట్స్ తో దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 

సరైన యాక్షన్ సన్నివేశం పడితే హృతిక్, టైగర్ పెర్ఫామెన్స్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అక్టోబర్ 2న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా వార్ మూవీ రిలీజవుతోంది. ఈ భారీ చిత్రం కోసం సిద్దార్థ్ ఆనంద్ విభిన్నమైన ప్రమోషనల్ స్ట్రేటజీని ఫాలో అవుతున్నాడు. 

ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలని హృతిక్, టైగర్ విడివిడిగా నిర్వహిస్తారట. సినిమా విడుదలయ్యే వరకు వీరిద్దరూ కలసి ఉండకూడదని దర్శకుడు కండిషన్ పెట్టాడు. ఈ విషయం గురించి సిద్దార్థ్ ఆనంద్ మాట్లాడుతూ.. వార్ మూవీలో హృతిక్, టైగర్ మధ్య పోరాటం తారాస్థాయిలో ఉంటుంది. గురు శిష్యులైన వీరిద్దరూ బద్దశత్రువులుగా పోటీ పడతారు. 

ప్రేక్షకులు అండ్ ఫీలింగ్ తో అక్టోబర్ 2న థియేటర్స్ లోకి వెళ్ళాలి. అందుకే హృతిక్, టైగర్ లతో విడివిడిగా ప్రమోషన్స్ చేయించాలని భావిస్తున్నట్లు సిద్దార్థ్ తెలిపారు.  సినిమా విడుదలయ్యే వరకు వీరిద్దరూ కలసి కనిపించకూడదని మేము నిర్ణయించినట్లు సిద్దార్థ్ తెలిపారు. వాణి కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.