సినిమాకి మంచి రివ్యూలు ఇస్తే మీడియాని నెత్తిన పెట్టుకునే దర్శకులు సినిమాకి బాగాలేదని నెగెటివ్ రివ్యూలు ఇచ్చినప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. గతంలో దర్శకుడు తేజ, దేవ్ కట్టా ఇలా చాలా మంది దర్శకులు మీడియాని క్రిటిక్స్ ని తక్కువ చేస్తూ మాట్లాడినవారే..

తాజాగా ఈ లిస్టులోకి చేరిపోయాడు నూతన దర్శకుడు ఇంద్రసేన. నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రియ, శ్రీవిష్ణు హీరోలుగా ఇంద్రసేన 'వీరభోగ వసంతరాయలు' సినిమాను  తెరకెక్కించాడు. గత వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చింది.

సినిమా విడుదలైన రెండో రోజునే చాలా థియేటర్లలో నుండి తీసేశారు. క్రిటిక్స్ కూడా ఈ సినిమాకి నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు. అయితే తన సినిమాకి నెగెటివ్ రివ్యూలు ఇచ్చిన వారిపై మండిపడ్డాడు దర్శకుడు ఇంద్రసేన.

సోషల్ మీడియాలో ఒక మంచి సినిమాని చెత్త రివ్యూలతో చంపకూడదని.. మిమ్మల్ని చూస్తే సిగ్గుగా ఉందంటూ మిడిల్ ఫింగర్ చూపిస్తున్నట్లుగా సింబల్స్ ని పెట్టాడు. 'వీరభోగ వసంతరాయలు' మంచి కల్ట్ ఫిలిం అని స్లోగా సినిమా పికప్ అవుతుందని రాసుకొచ్చాడు.