`ఖుషి` చిత్రం షూటింగ్‌లో విజయ్‌ దేవరకొండ, సమంత గాయపడినట్టు వార్తలు వైరల్‌ అయ్యాయి. తాజాగా దీనిపై దర్శకుడు శివ నిర్వాణ స్పందించారు.

విజయ్‌ దేవరకొండ, సమంత కలిసి `ఖుషి` సినిమాలో నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. `మహానటి` తర్వాత విజయ్‌, సమంత కలిసి నటిస్తున్న సినిమా కావడం, `ఖుషి` టైటిల్‌తో వస్తుండటంతో ఈ చిత్రంపై ఆసక్తితోపాటు, అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే కాశ్మీర్‌లో మొదటి షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది యూనిట్‌. తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నారు. 

ఈ నేపథ్యంలో ఈ చిత్రం షూటింగ్‌లో విజయ్‌ దేవరకొండ, సమంత గాయపడినట్టు వార్తలు వైరల్‌ అయ్యాయి. తాజాగా దీనిపై దర్శకుడు శివ నిర్వాణ స్పందించారు. ఒక్క ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చారు. ఇది ఫేక్‌ న్యూస్‌ అని కొట్టిపారేశారు. దీంతో విజయ్‌, సమంత అభిమానులు రిలాక్స్ అవుతున్నారు. మరోవైపు పీఆర్‌ టీమ్‌ సైతం ఈ వార్తలను ఖండించింది. `ఖుషి` సినిమా షూటింగ్‌లో విజయ్‌ దేవరకొండ, సమంతలకు గాయాలు అయినట్టు వస్తోన్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. అవాస్తవాలను నమ్మొద్దంటూ తెలిపారు. 30 రోజులు కాశ్మీర్‌ షూటింగ్‌ని పూర్తి చేసుకుని సోమవారమే హైదరాబాద్‌ వచ్చినట్టు చెప్పారు. త్వరలోనే రెండో షెడ్యూల్‌ స్టార్ట్ అవుతుందన్నారు.

Scroll to load tweet…

ఇదిలా ఉంటే కాశ్మీర్‌ షెడ్యూల్‌లో పహల్గామ్‌ ప్రాంతంలో స్టంట్‌ సీక్వెన్స్ షూట్ చేస్తున్న సమయంలో విజయ్‌, సమంతకి గాయాలైనట్టు వార్తలొచ్చాయి. షూటింగ్‌ చేస్తుండగా, వీరిద్దరు లిడర్‌ నదికిరెండు వైపులా కట్టిన తాడుపై వాహనం నడపవలసి వచ్చిందట. కానీ దురదృష్టవశాత్తు వాహనం నీటిలో పడిపోవడంతో విజయ్‌, సమంతకి గాయాలయ్యాయని, వెంటనే స్పందించిన టీమ్‌ స్థానిక ఆసుపత్రికి వీరిని తరలించి చికిత్స అందించారంటూ వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టిన నేపథ్యంలో తాజాగా టీమ్‌ స్పందించి క్లారిటీ ఇచ్చింది. 

ఇదిలా ఉంటే యూనిట్‌ హైదరాబాద్‌ తిరిగి వస్తోన్న క్రమంలో కారులో సమంత తీసిన ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ఇందులో కారు వెనకాల సీట్లో వెన్నెల కిషోర్‌, దర్శకుడు శివ నిర్వాణ, హీరో విజయ్‌ దేవరకొండ ఉన్నారు. వెన్నెల కిషోర్‌, శివ నిర్వాణల మధ్య ఏదో ఫన్నీ డిస్కషన్‌ జరుగుతుండగా, విజయ్‌ నవ్వుతూ కనిపించారు. ఈ ఫోటోని సమంత తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయగా, అది ఇప్పుడు ట్రెండ్‌ అవుతుంది. ఇందులో `నేను వినోదం విలువ కోసం పనికి వెళ్తా` అంటూ ఆమె పెట్టిన క్యాప్షన్‌ ఆకట్టుకుంటుంది.

View post on Instagram

ఇక లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న `ఖుషి` చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో పాన్‌ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు.ఈ ఏడాది డిసెంబర్‌ 23న `ఖుషీ` చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్‌, టైటిల్‌ పోస్టర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యింది.