దర్శకుడు శంకర్‌.. భారీ బడ్జెట్‌ చిత్రాలకు కేరాఫ్‌. ఆయన ఓ సినిమా తీస్తున్నాడంటే దాని బడ్జెట్‌ వందల కోట్లల్లో ఉంటుంది. అందుకు తగ్గ స్టార్‌ కాస్ట్ ని ఎంపిక చేసుకుంటారు శంకర్‌. ప్రస్తుతం ఆయన కమల్‌ హాసన్‌తో `భారతీయుడు2` సినిమాని తెరకెక్కిస్తున్నారు.  ఈ సినిమా అనేక కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి. 

దీంతో సినిమా ఉంటుందా? లేదా? అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఈ ప్రాజెక్ట్ నుంచి శంకర్‌ తప్పుకున్నట్టు ఆ మధ్య వార్తలొచ్చాయి. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ సినిమా సస్పెన్స్ లో ఉన్న నేపథ్యంలో శంకర్ ప్లాన్‌ బి అమలు చేస్తున్నారట. మరో భారీ మల్టీస్టారర్‌ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది. 

తెలుగు, తమిళం, మలయాలం, కన్నడ, హిందీ భాషల్లో పాన్‌ భారీ కాస్టింగ్‌తో పాన్‌ ఇండియా సినిమాని రూపొందించాలనుకుంటున్నారట. ఇప్పటికే తమిళం నుంచి విజయ్‌ సేతుపతి, కన్నడ నుంచి యష్‌ని ఎంపిక చేశారని, తెలుగు, మలయాళం, హిందీ భాషల నుంచి స్టార్స్ ని ఎంపిక చేసే పనిలో ఉన్నట్టు సమాచారం. రాక్‌లైన్‌ వెంకటేష్‌ ఈ సినిమాని నిర్మించబోతున్నట్టు టాక్‌. మరి ఇందులో నిజమెంతా అనేది మున్ముందు తేలనుంది.