రామ్ చరణ్ మూవీపై అదిరిపోయే అప్ డేట్ ఇచ్చాడు.. డైరెక్టర్ శంకర్. నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్ పై క్లారిటీ ఇచ్చాడు. ఓ పిక్ ను కూడా సోషల్ మీడియాలో శేర్ చేశాడు స్టార్ డైరెక్టర్. 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదరుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తరువాత ఆచార్య ప్లాప్ అవ్వడంతో.. చరణ్ నుంచి సాలిడ్ హిట్ కోసం ఎదరు చూస్తున్నారు ఫ్యాన్స్. ఈక్రమంలోనే సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో Rc15 మూవీ తెరకెక్కుతుండగా.. ఆ సినిమా షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతందా...? ఎప్పుడు చూసేద్దామా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ కంప్లీట్ అయ్యింది. కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించాల్సి ఉన్నట్టు తెలుస్తోంది. ఈక్రమంలోనే ఈసినిమా షూటింగ్ కు సబందించి ఓ అప్ డేట్ ఇచ్చారు డైరెక్టర్ శంకర్. 

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ ను అందించారు డైరెక్టర్ శంకర్. ఈ సినిమా షూటింగ్‌ను ప్రస్తుతం చార్మినార్ వద్ద చేయబోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ఆయన తెలిపాడు. దీనికి సంబంధించి శంకర్ చార్మినార్ దగ్గరగా ఉన్న ఓ ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ యాక్షన్ సీక్వెన్స్‌ కాని.. రామ్ చరణ్ సాంగ్ కాని ఇక్కడ షూట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ తరువాత మూవీ టీమ్ రాజమండ్రి వెళ్తారని తెలుస్తోంది. 

Scroll to load tweet…

ఇప్పటికే ఈమూవీ షూటింగ్ ఫారెన్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది. న్యూజీలాండ్‌లో రామ్ చరణ్, కియారా అద్వానీపై ఒక డ్యూయెట్‌ను షూట్ చేశారు. దీని కోసం దాదాపుగా 15 కోట్ల మేర ఖర్చుపెట్టినట్టు సమాచారం. అలాగే 500 మంది డాన్సర్లతో మరో పాట చిత్రీకరణను శంకర్ ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ ఈ సినిమాలో ఐఏఎస్ ఆఫీసర్‌గాకనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక వాటికి సబంధించిన కీలక సన్నివేశాలు కూడా పెండింగ్ ఉన్నట్టు టాక్. 

ఈ సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తుననాడు శంకర్. ఆయన అటు కమల్ హాసన్ తో భారతీయుడు2 కూడా తెరకెక్కిస్తున్నాడు. రెండు సినిమాలు బ్యాలన్స్ చేసుకుంటున్నాడు. ఇక శంకర్ తో రామ్ చరణ్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. భారీ కాస్టింగ్ తో .. రూపోందుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ జోడీగా కియారా అద్వాని నటిస్తోంది. శ్రీకాంత్, అంజలీ, సునిల్ లాంటి స్టార్స్ ఈమూవీలో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై.. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.