Asianet News TeluguAsianet News Telugu

`గేమ్‌ ఛేంజర్‌` అప్‌డేట్‌.. రామ్‌చరణ్‌తో సెట్‌లో సర్‌ప్రైజ్‌ చేసిన శంకర్‌..

 నిన్ననే `ఇండియన్‌ 2` డబ్బింగ్‌ వర్క్ స్టార్ట్ అయినట్టుగా అప్‌డేట్‌ ఇచ్చారు.  ఈ మేరకు ఓ వీడియో వైరల్‌ అయ్యింది. కట్‌ చేస్తే ఊహించని సర్‌ ప్రైజ్‌ ఇచ్చాడు శంకర్‌. 

director shankar surprise with game changer shooting shared set photo ram charan arj
Author
First Published Oct 10, 2023, 10:32 PM IST | Last Updated Oct 10, 2023, 10:32 PM IST

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ తాజాగా గ్లోబల్‌ స్టార్‌గా రాణిస్తున్నారు. ఆయన ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో `గేమ్‌ ఛేంజర్‌` చిత్రంలో నటిస్తున్నారు. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ చాలా కాలంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. అయితే మధ్య ఆగుతూ, మళ్లీ స్టార్ట్ అవుతూ, గ్యాప్ లు తీసుకుంటూ చిత్రీకరిస్తున్నారు దర్శకుడు శంకర్‌. ఆయన ఏక కాలంలో కమల్‌ హాసన్‌తో `ఇండియన్‌ 2` కూడా చిత్రీకరిస్తున్న నేపథ్యంలో రెండింటిని బ్యాలెన్స్ చేసే క్రమంలో `గేమ్‌ ఛేంజర్‌` షూటింగ్‌ డిలే అవుతుంది. 

అయితే నిన్ననే `ఇండియన్‌ 2` డబ్బింగ్‌ వర్క్ స్టార్ట్ అయినట్టుగా అప్‌డేట్‌ ఇచ్చారు. కమల్‌ హాసన్‌ పాల్గొనగా, దర్శకుడు శంకర్‌ స్వయంగా దగ్గరుండి డబ్బింగ్‌ చెప్పించారు. ఈ మేరకు ఓ వీడియో వైరల్‌ అయ్యింది. కట్‌ చేస్తే ఊహించని సర్‌ ప్రైజ్‌ ఇచ్చాడు శంకర్‌. కట్‌ చేస్తే నేడు సాయంత్రం `గేమ్‌ ఛేంజర్‌` సినిమా సెట్‌ నుంచి ఓ ఫోటోని సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. 

`హైదరాబాద్‌లో నిన్నటి నుంచి మా `గేమ్‌ ఛేంజర్‌` కోసం ఎమోషనల్‌ రైడ్‌(సీన్ల)ని రూపొందిస్తున్నాం` అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌కి సీన్‌ వివరిస్తున్న ఫోటోని పంచుకున్నారు శంకర్‌. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతుంది. ఇందులో రామ్‌చరణ్‌ స్పెడ్స్ పెట్టుకుని క్లీన్‌ షేవ్‌తో ఆఫీసర్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. అయితే నిన్ననే `ఇండియన్‌ 2` డబ్బింగ్‌లో పాల్గొన్న శంకర్‌, అదే రోజు `గేమ్‌ ఛేంజర్‌` షూటింగ్‌లో పాల్గొనడం ఆడియెన్స్ ఆశ్చర్యపరుస్తుంది. ఇది చరణ్‌ ఫ్యాన్స్ కి పెద్ద సర్‌ప్రైజింగ్‌ న్యూస్‌ అనే చెప్పాలి. 

ఇక హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో వేసిన ప్రత్యేక సెట్‌లో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతుందని తెలుస్తుంది. గచ్చిబౌలిలో ఈ షూట్‌ జరుగుతున్నట్టు తెలుస్తుంది. టాకీ పార్ట్ షూట్‌ చేస్తున్నారని, ఇవన్నీ చాలా ఎమోషనల్‌ సీన్లని తెలుస్తుంది. ఇందులో చరణ్‌తోపాటు అంజలి కూడా పాల్గొంటున్నారట. కంటిన్యూగా ఈ షెడ్యూల్‌ ఉంటుందని తెలుస్తుంది. ఈ చిత్రానికి థమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇందులో రామ్‌ చరణ్‌కి జోడీగా కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. శ్రీకాంత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమాలో రామ్‌చరణ్‌ సీఎంగా, ఐఏఎస్‌ అధికారిగా కనిపిస్తారని సమాచారం. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios