శంకర్ సినిమా అంటేనే భారీ సెట్లు, అదిరిపోయే గ్రాఫిక్స్‌లు. కేవలం ఆయన సినిమాలో ఒక పాట కోసం చేసే ఖర్చుతో ఓ చిన్న హీరోతో ఓ సినిమానే చేయవచ్చు అంటాంటారు.  


రామ్‌చరణ్‌ హీరోగా, డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి హైదరాబాద్‌లో బుధవారం ఉదయం పూజా కార్యక్రమం జరిపి ఓ పోస్టర్‌నుఎ రిలీజ్‌ చేసారు. ఇందులో రామ్‌చరణ్‌,కియారాలతో పాటు డైరెక్టర్‌శంకర్‌, దిల్‌ రాజు, సునీల్‌ సహా ఇతర టెక్నీషియన్లు అందరూ సూటుబూటు వేసుకొని ఫైల్స్‌ పట్టుకొని దర్శనమిచ్చారు. ఈ క్రేజీ పోస్టర్‌కు వీ ఆర్‌ కమింగ్‌ అంటూ క్యాప్షన్‌ను జోడించారు. ఆ పోస్టర్ వైరల్ అయ్యింది. అందరూ దాని గురించే మాట్లాడుకున్నారు. అదే సమయంలో ఆ పోస్టర్ అయ్యిన ఖర్చు ఎంత అనేది హాట్ టాపిక్ గా మారింది. 

అందుతున్న సమాచారం మేరకు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా పోస్టర్ కోసం శంకర్‌ ఒక కోటి 73 లక్షల రూపాయలు ఖర్చు చేయించినట్లు ఫిలిం నగర్ వార్త. కేవలం ఒక్క పోస్టర్‌కే ఇంత డబ్బు ఖర్చు పెట్టిస్తే ఇక సినిమా పూర్తయ్యేసరికి ఇంకేంత బడ్జెట్ అవుతుందో అంటూ సినీ వర్గాలు వారు డిస్కషన్స్ లో పడిపోయారు. నిర్మాతకు కూడా కావాల్సింది ఇదే డిస్కషన్ కాబట్టి ఫుల్ హ్యాపీట.

 ఇక ఈ సినిమాకు దిల్‌ రాజు మొత్తం రూ. 250 కోట్లు కేటాయించినట్లు సమాచారం. కాగా ఈ సినిమాలో చరణ్‌ సరసన కియారా అద్వానీ నటిస్తుండగా.. శ్రీకాంత్‌, సునీల్‌ అంజలి, జయరామ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ మూవీ రెగ్యూలర్‌ షూటింగ్‌ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. కాగా ఈ రోజు హైదరాబాద్‌ జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి, దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కియారా, చరణ్‌లకు చిరు క్లాప్‌ కొట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.