సారాంశం

దర్శకుడు ఎన్ శంకర్ నేడు మంత్రి కేటీఆర్ ని కలిసి వరదబాధితులకు తన వంతు సాయం అందించారు. ఆయన 10లక్షల రూపాయల చెక్కును కేటీఆర్ కి స్వయంగా అందిచడం జరిగింది. శంకర్ ఉదారతను కేటీఆర్ ప్రశంసించారు. అలాగే హీరో రామ్ కూడా నేడు కేటీఆర్ ని కలిసి 25లక్షల రూపాయల చెక్ అందించారు.  

వరదలు హైదరాబాద్ వాసులను ఇక్కట్లపాలు చేశాయి. ఎన్నడూ లేని విధంగా జీవం పోసుకున్న మూసినది పొంగి నగరంపై పడింది. అలాగే నగరంలోని అనేక చెరువులు గట్లు తెంచుకొని నివాస ప్రాంతాలను ముంచి వేశాయి. భారీ ఆస్థి నష్టం సంభవించింది. అనుకోని ఉపద్రవం వలన నగర వాసులు కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. 

ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకొనేందుకు టాలీవుడ్ ముందుకు వచ్చింది. స్టార్ హీరోలతో పాటు, పరిశ్రమకు చెందిన ప్రముఖులు, దర్శకులు తెలంగాణా సీఎం రిలీఫ్ ఫండ్ కి ఆర్ధిక సాయం ప్రకటించారు. చిరంజీవి, మహేష్ ప్రభాస్, పవన్ కళ్యాణ్ కోటి రూపాయల చొప్పున ఆర్ధిక సాయం ప్రకటించారు. ఎన్టీఆర్, బాలకృష్ణ, నాగార్జున తలో 50లక్షల రూపాయలు దానం చేశారు. 

తాజాగా ఈ లిస్ట్ లో దర్శకుడు ఎన్ శంకర్ చేరారు. ఎన్ శంకర్ నేడు మంత్రి కేటీఆర్ ని కలిసి వరదబాధితులకు తన వంతు సాయం అందించారు. ఆయన 10లక్షల రూపాయల చెక్కును కేటీఆర్ కి స్వయంగా అందిచడం జరిగింది. శంకర్ ఉదారతను కేటీఆర్ ప్రశంసించారు. అలాగే హీరో రామ్ కూడా నేడు కేటీఆర్ ని కలిసి 25లక్షల రూపాయల చెక్ అందించారు.