టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కోట్లలో పారితోషికం.. స్టార్ హీరోలతో సినిమాలు.. మాస్ ఆడియన్స్ లో ఆయనకి మంచి క్రేజ్ ఉంది. పక్క కమర్షియల్ సినిమాలు తీయడంలో దిట్ట. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం అతడి చిత్రాలకు ఆదరణ బాగా తగ్గింది.

అతడు తెరకక్కించే సినిమాల్లో కొన్ని సన్నివేశాలు రియాలిటీకి దూరంగా ఉండడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎక్కువైంది. దీంతో కొద్దిరోజులుగా బాగా సైలెంట్ అయిపోయాడు. పెద్ద హీరోతో చేసిన సినిమా ఫ్లాప్ కావడంతో ఇంకా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించలేకపోతున్నాడు.

అసలే ఫ్లాప్ లతో కుమిలిపోతున్న ఈ దర్శకుడికి మరో దెబ్బ ఎదురైంది. డైరెక్టర్ గారి భార్య అతడిని వదిలేసి వెళ్లిపోయిందట. దానికి కారణం అతడికి ఓ ఆర్టిస్ట్ తో ఉన్న సంబంధమే అని తెలుస్తోంది. టీవీ ఆర్టిస్ట్ అయిన ఓ మహిళతో సదరు డైరెక్టర్ చాలా ఏళ్లుగా ఎఫైర్ సాగిస్తున్నాడు. తన సినిమాల్లో కూడా ఆమెకి రోల్స్ ఇస్తుంటాడు. ఈ విషయం మీడియాలో  రావడంతో విషయం పెద్దదైంది.

భర్త ఎఫైర్ గురించి వస్తోన్న కథనాలను మీడియాలో చూసిన డైరెక్టర్ భార్య అతడితో కలిసి ఉండలేక ఇంటి నుండి వెళ్లిపోయిందట. చాలా రోజులుగా ఆమెని ఇంటికి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నా.. ఆమె మాత్రం రావడం లేదని తెలుస్తోంది. మరి ఇప్పటికైనా ఈ స్టార్ డైరెక్టర్ తన ప్రవర్తన మార్చుకొని ఎఫైర్లకు దూరంగా ఉంటాడేమో చూడాలి!