టాలీవుడ్ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి కమ్ముల శేషయ్య ఈ రోజు ఉదయం మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉదయం 6 గంటల సమయంలో పరిస్థితి విషమించటంతో ఆయన తుది శ్వాస విడిచినట్టుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. శేషయ్య వయసు 89 సంవత్సరాలు.

ఆయన మృతి దర్శకుడు శేఖర్ కమ్మలు ఇంట విషాద చాయలు నెలకొన్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి సంతాపం తెలియజేశారు. ఈ రోజు సాయంత్రం బన్సీలాల్‌ పేట స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

శేఖర్‌ కమ్ముల ప్రస్తుతం నాగచైతన్య హీరోగా లవ్‌ స్టోరీ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఈ పాటికే రిలీజ్‌ కావాల్సి ఉన్నా.. లాక్ డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ఈ లాక్‌ డౌన్‌ సమయంలో తన వంతుగా ప్రజల్లో అవేర్‌నెస్‌ కల్పించేందుకు వీడియో మేసేజ్‌లు ఇంటర్వ్యూలు చేస్తున్నారు శేఖర్‌ కమ్ముల.