హృదయకాలేయం  సినిమాతో తనేంటో ప్రూవ్ చేసుకుని సెన్సేషన్ గా మారిన దర్శకుడు సాయి రాజేష్. ఆయన తదుపరి చిత్రం కొబ్బరి మట్ట విషయంలో  కొద్దిగా ఆర్దిక ఇబ్బందులు వచ్చాయి. ఆ విషయాలను బేస్ చేసుకుని ఓ వెబ్ సైట్ లో వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా, పరువుని ఇబ్బంది  పెట్టేలా ఓ న్యూస్ లాంటి గాసిప్ ప్రచురితమైంది. ఆ గాసిప్ విషయమై సాయి రాజేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అంతేకాదు లీగల్ నోటీస్ ని సైతం  పంపారు. ఆయన పెట్టిన ట్వీట్ ని మీరు ఇక్కడ చదవచ్చు. 

 

ఆ గాసిప్ లో ఓ ఎన్నారైను, హీరోయిన్ ని  మోసం చేసి కోటి ఇరవై లక్షలు సంపాదించిట్లుగా రాసారు. అయితే ఆ గాసిప్ డైరక్ట్ గా సాయి రాజేష్ ని అనకపోయినా...చదివినవారికి ఆయనే అని ఇట్టే అర్దమవుతుంది. దాంతో సాయి రాజేష్ ఆ వెబ్ సైట్ నిర్వాహకుడుకి లీగల్ నోటీస్ పంపించారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. 

ఆయన ట్వీట్ లో రాసిన విషయాలు యధాతథంగా... 

శత్రువులు ఏ వైపు నుంచి దాడి చేస్తారో తెలీదు కాబట్టి... నా వరకు నిజాయితీగా కొన్ని విషయాలు చెప్తున్నాను...

2014 లో కొబ్బరిమట్ట సినిమా తీస్తాను అని నిర్మాతగా వచ్చిన ఒక NRI ...పూర్తి డబ్బులు ఇవ్వలేక వదిలేసిన సమయంలో.... చాలా మంది జీవితాలు అందులో ఆధారపడి ఉన్నాయి కాబట్టి...నేనే అప్పు తీసుకొచ్చి పూర్తి చేద్దామన్న ఆలోచనే నా లైఫ్ లో ఇలాంటి ఇబ్బందులు తీసుకొచ్చింది....

ఆ NRI ఇచ్చిన చాలా కొంత డబ్బు... అంటే సినిమా బడ్జెట్ లో పదవ వంతు కూడా ఉండదు... ఒక చీటీ పాట ద్వారా పాడి నాకు ఇచ్చాడు....నా ఖర్మ కాలి... అతను అమెరికా లో ఉండటం తో...అతని రిక్వెస్ట్ మీద రెండు బ్లాంక్ చెక్స్ ఇవ్వటం షూరిటీ గా నేను ఇవ్వటం.. ...అలా ఇవ్వటం ఎంత ఇబ్బందుల్లో నెడుతుందో తెలుసుకోలేని అమయకత్వంలో ఇచ్చాను...

కానీ సినిమా ఆపటం ఇష్టం లేక కొన్ని కోట్ల రూపాయలు ఒక పెద్ద బ్యానర్ దగ్గర మరియు చాలా మంది నా స్నేహితులు, కుటుంబ సభ్యుల దగ్గర almost crowd funding పద్దతిలో మొత్తానికి దిగ్విజయంగా పూర్తి చేశాను...అది కూడా అప్పుగా...అంత మొత్తం లో సినిమా తియ్యటం risk అయినా.... ఆ సినిమా మీద వున్న నమ్మకం అలాంటిది...సినిమా లో ట్రిపుల్ action అవటం వల్ల.... మేము వేసుకున్న బడ్జెట్ రెండింతలు అయింది.... అయినా మొండి నా కొడుకు లాగా డబ్బు తీసుకొచ్చి పెట్టాను...

ఇప్పుడే ఒక ట్విస్ట్ జరిగింది.. రెండు చెక్కులు బౌన్స్ అయినట్టు మెసేజ్, కోర్ట్ నోటీస్....ఎం అయిందో ఇంక మీకు చెప్పక్కర్లేదు.... ఆ షాక్ నుంచి తేరుకొని ....పూర్తిగా బయటకి వచ్చి...సినిమా విడుదల సమయంలో Great Andhra సహాయంతో ఆర్టికల్ రాయించారు..... ఎవరు రాయించారో తెలీదు...కానీ నన్ను భయపెట్టో, ఏదో ఒక రకగా ఇరికించో చెయ్యటం ఇక్కడ ఉద్దేశం అయి ఉండొచ్చు...

కానీ అన్నిటికంటే ఆ బాధ కలిగించిన విషయాలు రెండు..

 

పాయింట్1 :

ఒక పెద్ద మెగా ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు తీసుకున్నాను.. అతనికే టోకరా ఇచ్చాను....అతను ఇప్పుడు ఎం చెయ్యాలో తోచలేని స్థితి అని రాశారు.... అప్పు తీసుకున్న మాట నిజం....కానీ ఆ పెద్ద ప్రొడ్యూసర్ , వారి టీమ్ ..ఈ రోజుకి నన్ను ఒక తమ్ముడిలా నా వెనక నిలబడే వున్నారు...నా మీద, సినిమా మీద వున్న నమ్మకం అది.....ఈ ఆర్టికల్ చూసి మేమె బాధ పడట్లేదు...నువ్వెందుకు బాధ పడుతున్నావు అని ఓదార్చిన మంచి మనుషులు..అలాంటి వారికి నేను టోకరా ఇచ్చాను అని రాయటం నిజంగా బాధ వేసింది

 

పాయింట్ 2 :

5 గురు NRI ల దగ్గర ..ఈ సినిమాకి నిర్మాతగా షేర్లు ఇస్తాను అని కోటి రూపాయలు తీసుకోవటం... పైన చెప్పిన వ్యక్తి తప్ప...అసలు ఆ మిగతా 4 NRI లు ఎవరో కూడా నాకు తెలీదు....ఆ కోటి రూపాయలు ఎప్పుడిచారో ....అసలు ఆ నలుగురు NRI ల facelu ఎలా ఉంటాయో తెలీదు.. అసలు వాళ్ళ షేర్లు ఏంటో ...ఇంత దారుణంగా ఎలా రాసారో...అర్థం కాలేదు...

 

పాయింట్ 3 :

ఒక హీరోయిన్ దగ్గర ఈ సినిమాకి అని చెప్పి 20 లక్షలు తీసుకోవటం, ఆ డబ్బు నేను తిరిగి ఇవ్వకపోవటం తో వారు కోపంగా ఉండటం అని రాశారు. అసలు ఇది రివర్స్ లో జరిగితే.. దాన్ని ఇలా మార్చి పులిహోర కలపటం.... హృదయకలేయం సమయంలో adjustment కోసం నా దగ్గర తీసుకున్న డబ్బు...వారు సెటిల్ చేసి... ఒక అగ్రిమెంటు కూడా రాసుకున్నాము...ఇక ఇద్దరి మధ్య లావాదేవీలు ఏం లేవు అని... ఇప్పటికీ నా మొబైల్ లో భద్రంగా ఉంది ఆ కాపీ..అనవసరంగా వాళ్ళని ఇందులోకి లాగటం..

 

పాయింట్4 :

డ్రగ్స్, కాస్టింగ్ కౌచ్ తర్వాత ఇదే ఇండస్ట్రీలో పెద్ద scam...

ఏంటి...రెండు కోట్లు అప్పు చేసి సినిమా తీస్తే....అది delay అయితే.... అది అతి పెద్ద స్కామ్ ఆ...

అలాంటి చీడ పురుగులుని ఇండస్ట్రీ దూరం పెట్టాలనెంతగా ఆర్టికల్ ఎవరు రాయించి వుంటారు....అసలు రాసిన వ్యక్తికి.. రాయించిన వ్యక్తికి ఏంటి సంబంధం.దేవుడికే ఎరుక...

నాకు రావాల్సిన డబ్బులు 100 ఉంటాయి... నేను ఇవ్వాల్సిన డబ్బులు 100 ఉంటాయి...అసలు దీనికి డ్రగ్స్ కేస్ కి ఏంటి సంబంధం...

చెక్ బౌన్స్ విషయం ఒక్కటి తప్ప ఇన్ని ఘోరమైన అబద్దాలు తర్వాత

రేపు ఎన్ని నా మీద రాయబోతున్నారో మీ ఊహకే వదిలేస్తున్నా..

 

నాకు తెలిసిన 4-5 ఉచిత సలహాలు

1) ఆ దర్శకుడు డ్రగ్స్ లేనిదే action cut చెప్పలేడు... కుడి చేతి మీద ఇంజెక్షన్ లు గుచ్చి గుచ్చి...కుంకుడు కాయంత పుట్టు మచ్చ ఉంటుంది

2) అతనికి నిద్ర లేవగానే ఆటో అమ్మాయి, ఇటో అమ్మాయి లేకపోతె షూటింగ్ కి రాడట.... కారవాన్ లో నగ్న బొమ్మలతో....

3) casting couch కి ఆద్యుడు అతనే....అనుభవించని ఆడది లేదు....harass cheyyani మనిషి లేడు

4) పరాయి సొమ్ము తో నీళ్ళల్లో నడిచే audi కార్ కొన్న కామెడీ దర్శకుడు....మరో బకారా డబ్బుతో Bankok టూర్....

రాయండి ...ఇంకా....సిద్ధం

దయచేసి కామెంట్లలో ఎవరినీ నిందించ వద్దని మనవి 🙏

మీరు నా పరువు తీసాము అని చంకలు గుడ్ద్దుకొవచ్చు

నన్ను బాధ పెట్టాము అని మురిసిపోవచ్చు

కానీ ఏం చేసినా నాలో ఉన్న సినిమాని మీరు తొక్కలేరు..

ఆ కాన్ఫిడెన్స్ ని చంపడం ఎవడి వల్ల కాదు...

Iam a fighter...I wont give up...