పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భల్లాల దేవుడు రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు భీమ్లా నాయక్ ఫీవర్ తో ఊగిపోతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతుంటే హంగామా ఒక రేంజ్ లో ఉంటుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భల్లాల దేవుడు రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు భీమ్లా నాయక్ ఫీవర్ తో ఊగిపోతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతుంటే హంగామా ఒక రేంజ్ లో ఉంటుంది. అమలాపురం నుంచి అమెరికా వరకు పవన్ ఫ్యాన్స్ భీమ్లా నాయక్ జపం చేస్తున్నారు. నేడు హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. 

దీనితో భీమ్లా నాయక్ మ్యానియా పీక్స్ కి చేరుకుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తెలంగాణ మంత్రి కేటీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతుండడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. పొలిటికల్ గా ఎలా ఉన్నా.. కేటీఆర్, పవన్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. దీనితో వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించి అభిమానులని ఆకట్టుకున్నారు. 

ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భీమ్లా నాయక్ దర్శకుడు సాగర్ చంద్ర అద్భుతంగా ప్రసంగించారు. 11 ఏళ్ల క్రితం నుంచి తాను చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన క్షణాలని గుర్తు చేసుకున్నారు. తనకు అండగా నిలబడిన కుటుంబ సభ్యులని, స్నేహితులని గుర్తు చేసుకున్నారు. 

ఇక పవన్ కళ్యాణ్ గారి పంజా ఆడియో వేడుకలో ఒక అభిమానిగా ఎంటర్ అయినప్పుడు విపరీతమైన క్రౌడ్ ఉన్నారు. దీనితో లోపలికి వెళ్ళలేకపోయాను. నెట్టేశారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పక్కన నిలబడి మాట్లాడుతున్నాను అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. రానా అద్భుతమైన నటుడు అంటూ ప్రశంసించారు. 

పవన్ ఫ్యాన్స్ లో, ట్రెండ్ వర్గాల్లో భీమ్లా నాయక్ చిత్రంపై కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో పవన్ కి జోడిగా తొలిసారి నిత్యామీనన్ నటిస్తోంది. అలాగే రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది. మురళి శర్మ, రావు రమేష్, సముద్ర ఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.