సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్నప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఈ ఒక్క విషయంలో నిరాశకు గురైనట్టు తెలుస్తోంది. మెలోడియస్ సాంగ్ “అంత ఇష్టం ఏందయ్యా” అనే పాటను మేకర్స్ సినిమా నుండి పెట్టమని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రిక్వెస్ట్ లు చేయటమే అందుకు ఉదాహరణగా చెప్పాలి. 


ఈ నెల లాస్ట్ వీకెండ్ లో థియేటర్లలలో దిగారు ‘భీమ్లా నాయక్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌, రానా కారణంగా థియేటర్లు కళకళ లాడాయి. ఏపీలోనూ నూరు శాతం ఆక్యుపెన్సీ ఉండటం, రాత్రి కర్ఫ్యూ ఎత్తివేయడంతో కలిసొచ్చింది. తెలంగాణలో మంచి కలెక్షన్లు ఈ చిత్రానికి వచ్చినా, ఏపీలో టిక్కెట్ రేట్స్ తక్కువ ఉండటంతో ఆ ప్రభావం గ్రాస్ పై భారీగానే పడింది. అయినా ఫస్ట్ వీకెండ్ లో వరల్డ్ వైల్డ్ ఈ మూవీ 60 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం.

 సింగిల్ లాంగ్వేజ్ లో, తక్కువ రేట్లతో ప్రదర్శితమైనా ‘భీమ్లా నాయక్’ మంచి కలెక్షన్లను పొంది… ఈ నెల విన్నర్ గా నిలిచిందనే చెప్పాలి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం టీమ్ సక్సెస్ పార్టీలు సైతం చేసుకుంది. ఇక ఈ చిత్రం కలెక్షన్స్ వీకెండ్ అయ్యాక డ్రాప్ అవుతుందనే అంచనాలో డిలేట్ చేసిన సీన్స్ కలుపుతారని అందరూ ఊహించారు.

ముఖ్యంగా మొదట్లో యూట్యూబ్ ను ఊపేసిన అంత ఇష్టం ఏందయ్యా సాంగ్ ను ఆడ్ చేస్తారంటూ వార్తలు వచ్చాయి. అయితే మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ సాగర్ కే చంద్రను ఈ సాంగ్ విషయం అడిగారు. డైరెక్టర్ రెస్పాండ్ అయ్యి అసలు ఆ సాంగ్ ని షూట్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. కేవలం రికార్డు మాత్రమే చేశామని, ఆ తర్వాత ఆ సాంగ్ ఈ కథకు వర్కౌట్ కాదని షూటింగ్ చేయలేదని స్పష్టం చేశారు. అంటే ఆ సాంగ్ ఈ సినిమాలో ఉండే అవకాశం లేదని తేలిపోయింది.

అలాగే తమన్ సైతం ఇదే విషయమై సమాధానం ఇచ్చారు. ఈ ప్రశ్నకు సమాధానంగా ...మండుతున్న స్టౌవ్ పై నీళ్లు పోస్తే ఎలా ఉంటుంది అంటూ త‌మ‌న్ ఎదురు ప్ర‌శ్న వేశారు. త‌మ‌న్ స‌మాధానం చూస్తే సినిమా మాస్ యాక్ష‌న్ తో కొన‌సాగుతున్న స‌మ‌యంలో ఆ పాట క‌రెక్ట్ కాక‌పోవ‌డంతో తొల‌గించిన‌ట్టు క‌నిపిస్తోంది.

కాకపోతే ఆ సాంగ్ మాత్రం ఆడియో పరంగా పెద్ద హిట్ అయింది. సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్నప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఈ ఒక్క విషయంలో నిరాశకు గురైనట్టు తెలుస్తోంది. మెలోడియస్ సాంగ్ “అంత ఇష్టం ఏందయ్యా” అనే పాటను మేకర్స్ సినిమా నుండి పెట్టమని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రిక్వెస్ట్ లు చేయటమే అందుకు ఉదాహరణగా చెప్పాలి. ఏదమైనా ఈ లిరికల్ సాంగ్ విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక గడిచిన మూడు రోజుల్లో భీమానాయక్ కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. ఇప్పటికే వంద కోట్ల మార్క్ ను కూడా క్రాస్ చేసింది.