Asianet News TeluguAsianet News Telugu

గుడ్ బై ఇండియా, కరోనా ఆటం బాంబ్.. ఆర్వీజీ వివాదాస్పద ట్వీట్లు

మహారాష్ట్రలో ఇటీవల లాక్ డౌన్ విధిస్తామని చెప్పి.. తర్వాత  ప్రభుత్వం ఆ విషయంలో వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయంపై కూడా ఆర్జీవీ స్పందించాడు.
 

director RGV Tweets on Coronavirus ram
Author
Hyderabad, First Published Apr 15, 2021, 9:28 AM IST

కరోనా మహమ్మారి దేశంలో మరోసారి విలయతాండవం చేస్తోంది. కరోనా కేసులు రోజురోజుకీ పెరుగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కరోనా పై వివాదాస్పద సినీ దర్శకుడు ఆర్జీవీ స్పందించాడు. తనదైన శైలిలో కరోనాపై వరస ట్వీట్లు చేశాడు. కరోనాని ఆటంబాంబుతో పోలుస్తూ.. కుంభమేళాపై కూడా కామెంట్స్ చేశాడు.

మహారాష్ట్రలో ఇటీవల లాక్ డౌన్ విధిస్తామని చెప్పి.. తర్వాత  ప్రభుత్వం ఆ విషయంలో వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయంపై కూడా ఆర్జీవీ స్పందించాడు.

 

ఉగాది సందర్భంగా ప్రారంభమైన కుంభమేళాను ప్రస్తావిస్తూ ట్వీట్లు చేశారు. కుంభమేళాను కరోనా ఆటం బాంబుగా సరిపోల్చారు. ఈ పేలుడుకు ఎవరు బాధ్యత తీసుకుంటారు? అని ప్రశ్నించారు. గుడ్‌బై ఇండియా, వెల్కమ్‌ కరోనా అంటూ ట్వీట్‌ చేశారు. కుంభమేళ నుంచి వచ్చినవారికి మాస్క్‌లే అవసరం లేదని.. వాళ్లు ఇప్పటికే గంగలో మునిగి వైరస్‌ను వదిలేశారు అని పేర్కొన్నారు. 

ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే ప్రకటించిన నిషేదాజ్ఞలపై స్పందించారు. నేను దీనిని లాక్‌డౌన్‌ అని ఉద్దవ్‌ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై ట్వీట్‌ చేశారు. ‘దానికి ఇంకో పేరు పెడుతున్నా. బారసాల కార్యక్రమానికి అందరూ రండి. గిఫ్ట్‌లు తీసుకురావడం మర్చిపోవద్దు’ అని వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. కుంభమేళాలో 31 లక్షల మంది పాల్గొంటే వారిలో 26 మందికే పాజిటివ్‌ సోకిన వార్తపై కూడా ఆర్జీవీ స్పందించి ఓ పోస్టు చేశారు. ‘అయితే అందరికీ ఎలాంటి సమస్య లేదు. అందరం పార్టీ చేసుకుందాం’ అని తెలిపాడు.

Follow Us:
Download App:
  • android
  • ios