Asianet News TeluguAsianet News Telugu

Rajamouli: డైరెక్టర్ రాజమౌళి హత్యకు కుట్ర!


దర్శకుడు రాజమౌళిపై అసూయతో రగిలిపోతున్న కొందరు గ్రూపుగా తయారయ్యారట. రాజమౌళిని చంపేందుకు కుట్ర పన్నారట. 
 

director ram gopal varma sensational tweet conspiracy to kill rrr director rajamouli
Author
First Published Jan 24, 2023, 9:42 AM IST

వివాదాల వర్మ మరో సంచలన ట్వీట్ తో వచ్చారు. ఈసారి రాజమౌళి టార్గెట్ గా కొన్ని ఊహించని కామెంట్స్ చేశారు. ఆయన్ని చంపేందుకు కుట్ర జరుగుతుందంటూ బాంబు పేల్చాడు. వర్మ తన ట్వీట్ లో '' రాజమౌళి సార్ మీ భద్రతను మరింత పటిష్టంగా మార్చుకోండి. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని కొందరు ఇండియన్ డైరెక్టర్స్ ఒక గ్రూప్ గా మారి మిమ్మల్ని చంపాలి అనుకుంటున్నారు. ఆ గ్రూప్ సభ్యుల్లో నేను కూడా ఒకడిని. మందు కిక్కులో ఈ కుట్ర గురించి నేను చెప్పేశాను'' అని కామెంట్ చేశారు. 

వర్మ పరోక్షంగా రాజమౌళి ప్రపంచ స్థాయి దర్శకుడిగా హాలీవుడ్ లో గౌరవాలు అందుకోవడం, అవార్డులు గెలుపొందడం చూసి చాలా మంది ఇండియన్ డైరెక్టర్స్ నొచ్చుకుంటున్నారు. ఈర్ష్య పడుతున్నారని చెప్పాడు. అది నిజం కూడాను. రాజమౌళి గొప్ప తనాన్ని ఒప్పుకోలేని ప్రేక్షకులు, దర్శకులు ఇండియాలో చాలా మంది ఉన్నారు. అంతెందుకు మన పొరుగున ఉన్న కోలీవుడ్ కి రాజమౌళి అంటే ఎక్కడలేని కోపం. ఆర్ ఆర్ ఆర్ సినిమాను కూడా వారు ట్రోల్ చేశారు. 

ఆర్ ఆర్ ఆర్ ని స్పీల్బర్గ్, కామెరూన్ వంటి దిగ్గజ దర్శకులే మెచ్చుకుంటున్న నేపథ్యంలో బాలీవుడ్, కోలీవుడ్ మేకర్స్ చూసి తట్టుకోలేకపోతున్నారనేది వాస్తవం. కాగా మరో రెండు ట్వీట్స్ లో వర్మ రాజమౌళిని ఆకాశానికి ఎత్తారు. మొఘల్ ఏ అజమ్ దర్శకుడు కే అసిఫ్ కంటే, షోలే డైరెక్టర్ రమేష్ సిప్పీ కన్నా కూడా రాజమౌళి గొప్పని, వారిని దాటేశాడంటూ కామెంట్ చేశారు. రాజమౌళి కాలి వేళ్ళు నోట్లో పెట్టుకోవాలని ఉందని తన మార్క్ వ్యాఖ్యలు చేశాడు. 

కాగా నేడు ఆస్కార్ నామినేషన్స్ ప్రకటించనున్నారు. అందరి దృష్టి ఆర్ ఆర్ ఆర్ మీదే ఉంది. అకాడమీ సభ్యులు ప్రకటించే చిత్రాల జాబితా కోసం భారతీయులు ఎదురుచూస్తున్నారు. ఎన్నడూ లేనంత ఆసక్తి ఈ ఏడాది ఆర్ ఆర్ ఆర్ కారణం ఆస్కార్ అవార్డులపై భారతీయులకు ఏర్పడింది. ఆర్ ఆర్ ఆర్ తో పాటు ఇండియా నుండి పది చిత్రాల వరకు షార్ట్ లిస్ట్ లో చోటు సంపాదించాయి. మరి నామినేషన్స్ లో ఏ చిత్రాలకు చోటు దక్కుతుందో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios