‘వ్యూహం’ సినిమాకు నారా లోకేష్ Nara Lokesh అడ్డుపడ్డారంటూ రామ్ గోపాల్ వర్మ Ram Gopal Varma మొన్నటి వరకు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆయనే వేదికపై థ్యాంక్స్ చెప్పారు..
డాషింగ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ప్రస్తుతం తెరకెక్కిస్తున్న పొలిటికల్ డ్రామా ‘వ్యూహం’. ఈ చిత్రం మొదటి నుంచి వివాదాలను ఎదుర్కొంటూనే వచ్చింది. ఎట్టకేళకు ప్రస్తుతం రిలీజ్ కాబోతోంది. ఇవ్వాళ ఈ చిత్రం ట్రైలర్ ను కూడా ఆర్జీవీ విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్ లో నారా లోకేష్ Nara Lokeshకు థ్యాంక్స్ చెప్పారు. మొన్నటి వరకు తన సినిమాకు అడ్డుపడుతున్నారని విమర్శలు చేసిన ఆర్జీవీ తాజాగా థ్యాంక్స్ చెప్పి షాక్ ఇచ్చారు. దాని వెనకాల ఉన్న కారణం కూడా చెప్పారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. ‘వ్యూహం’, ‘శపథం’ సినిమాల రిలీజ్ విషయంలో నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన ఒకే ఒక వ్యక్తి నారా లోకేష్. నేను, దాసరి కిరణ్ కుమార్ ఈ సినిమాలను డిసెంబర్ లో రిలీజ్ చేయాలని అనుకున్నాం. లోకేష్ కోర్టుకు వెళ్లి మా సినిమా రిలీజ్ ను అడ్డుకున్నారు. ఇప్పుడు సరిగ్గా ఎలక్షన్స్ కు ముందే మా రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా పరోక్షంగా హెల్ప్ చేశారు. అందుకే ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాం. డిసెంబర్ లో రిలీజ్ అయి ఉంటే ఈపాటికి జనం మర్చిపోయేవారు. నేను ముందు నుంచీ చెబుతున్నా..ఎవరైనా ఏ సినిమానైనా రిలీజ్ ను కొన్నాళ్లు ఆపించగలరు గానీ శాశ్వతంగా సినిమా రిలీజ్ కాకుండా ఆపలేరు.
సెన్సార్ అనేది ఔట్ డేటెడ్ వ్యవస్థ. ఏ కథ తీసినా వాళ్లకు అభ్యంతరాలు ఉంటాయి. ఈ సినిమాలో కొన్ని సీన్స్ తీసేశారు. అయినా కథలోని ఎమోషనల్ కంటెంట్ మిస్ కాలేదు. ప్రజా జీవితంలో ఉన్న కొందరి మీద మనకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. అలా నాకు ఉన్న అభిప్రాయాలతో వాస్తవ ఘటనల నేపథ్యంగా నేను వ్యక్తీకరించిన సినిమాలే వ్యూహం, శపథం. ఈ సినిమాలు ఎవరి మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయి అనేది నేను చెప్పలేను. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి ఫిలిం మేకర్ కు వాస్తవ ఘటనలను తన కోణంలో తెరకెక్కించే స్వేచ్ఛ ఉందని హైకోర్టు మాకు ఇచ్చిన ఆర్డర్స్ లో పేర్కొంది. వైఎస్ గారి మృతి నుంచి వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసేవరకు వ్యూహం కథ ఉంటుంది. జగన్ సీఎం ప్రమాణ స్వీకారం నుంచి చంద్రబాబు జైలుకు వెళ్లేవరకు శపథం కథ చూపిస్తున్నాం. నేను ఈ సినిమాను జగన్ కోసం కాదు పవన్, చంద్రబాబు కోసం తీశాను. అన్నారు. అనంతరం నిర్మాత దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ... రెండు సినిమాలను తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500 థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నాం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ జీవితం ఆధారంగా రూపొందించిన సినిమాలే ‘వ్యూహం’, ‘శపథం’. ఈ సినిమాలను రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఈ మూవీస్ లో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించగా…వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించనుంది. సెన్సార్ అడ్డంకులు దాటుకున్న ‘వ్యూహం’ ఈ నెల 23న, ‘శపథం’ మార్చి 1న గ్రాండ్ గా థియేటర్స్ లోకి రాబోతున్నాయి. ఈ సినిమాల ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.
