వీధికుక్కల దాడిలో బాలుడు మరణించిన సంఘటన తెలంగాణాలో ప్రకంపనలు రేగుతుంది. కేసీఆర్ ప్రభుత్వంతో పాటు జిహెచ్ఎంసీ పాలకవర్గం మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇక దర్శకుడు వర్మ ఈ సంఘటనపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.  

ఒంటరిగా రోడ్డుపై వెళుతున్న నాలుగేళ్ళ బాలుడిపై వీధి కుక్కలు క్రూరంగా దాడి చేసి చంపాయి. హైదరాబాద్ నగర నడిబొడ్డులో జరిగిన ఈ సంఘటన ప్రజల భద్రతను ప్రశ్నించేదిగా ఉంది. ప్రభుత్వం మీద విపక్షాలతో పాటు సాధారణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల దాడికి సంబంధించిన వీడియో చూసి ప్రతి ఒక్కరు ఆవేశానికి గురవుతున్నారు. ఈ ఘటనపై హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గద్వాల్ స్పందన కొంచెం నిర్లక్ష్యపూరితంగా ఉందనే మాట వినిపిస్తోంది. 

ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మ జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి గద్వాల్ ని ఉద్దేశిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. 'కేటీఆర్ గారు.. మీరు మేయర్ విజయలక్ష్మి గద్వాల్ ని ఎలా నియమించారో నాకు తెలియదు. ఎందుకంటే నాకు పొలిటికల్ సిస్టం అంతగా ఐడియా లేదు. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే... ఒక ఐదువేల వీధి కుక్కలను ఆమె ఇంట్లోకి పంపి గేట్లు, తాళాలు వేసేయండి. ఆమె ఆ కుక్కలను ఎలా ప్రేమిస్తారో, ఎలా పోషిస్తారో చూద్దాం'' అని వీడియో బైట్ విడుదల చేశారు. 

Scroll to load tweet…
Scroll to load tweet…

వీధి కుక్కలు దాడి వర్మను బాగా డిస్టర్బ్ చేసినట్లు తెలుస్తుంది. కేవలం వ్యవస్థలు విఫలం చెందడం వలెనే బాలుడు మరణించాడని ఆయన ఆరోపణ. కాగా ఈ విషయంలో యాంకర్ రష్మీ సైతం విమర్శలు ఎదుర్కొన్నారు. రష్మీ లాంటివారు వీధి కుక్కలను నియంత్రించకుండా కేసులు వేస్తున్నారు. అందుకే ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయని పలువురు విమర్శలు గుప్పించారు. ఈ విషయంలో రష్మీతో నెటిజెన్స్ కి సోషల్ మీడియా వాగ్వాదం నడిచింది.