ప్రస్తుతం సోషల్ మీడియాలో నెపోటిజం నేపథ్యంలో కరణ్ జోహర్‌ను విమర్శించే వాళ్లు ఒక్కరి కూడా పని ఇవ్వలేరు. కానీ కరణ్‌ జోహార్‌ ఎంతో మంది వర్క్‌ ఇస్తున్నాడం`టూ కామెంట్ చేశాడు వర్మ. సోషల్ మీడియాలో ట్వీట్లు చేసే వారు ఖాళీగా ఉన్నవారికి ఎంటర్‌టైన్మెంట్ మాత్రమే ఇస్తారు. కానీ కరణ్ జోహార్‌, ఎక్తా కపూర్‌, ఆదిత్య చోప్రా వంటి వారు ఎంతో మంది ఉపాది కల్పిస్తున్నారన్నాడు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. ఆయన మృతికి డిప్రెషన్ కారణంగా అని కొందరు అంటుంటే.. ఇండస్ట్రీలోని రాజకీయాల కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇండస్ట్రీలో వారసులను కాపాడేందుకు నిజమైన టాలెంట్‌ను చంపేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు కొందరు తారలు. ఈ నేపథ్యంలో సంలచన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్‌లో స్పందించాడు. నెపోటిజం (వారసత్వం) అనేది లేకపోతే వ్యవస్థ కుప్పకూలుతుందంటూ కామెంట్ చేశాడు వర్మ.

`ప్రస్తుతం సోషల్ మీడియాలో నెపోటిజం నేపథ్యంలో కరణ్ జోహర్‌ను విమర్శించే వాళ్లు ఒక్కరి కూడా పని ఇవ్వలేరు. కానీ కరణ్‌ జోహార్‌ ఎంతో మంది వర్క్‌ ఇస్తున్నాడం`టూ కామెంట్ చేశాడు వర్మ. సోషల్ మీడియాలో ట్వీట్లు చేసే వారు ఖాళీగా ఉన్నవారికి ఎంటర్‌టైన్మెంట్ మాత్రమే ఇస్తారు. కానీ కరణ్ జోహార్‌, ఎక్తా కపూర్‌, ఆదిత్య చోప్రా వంటి వారు ఎంతో మంది ఉపాది కల్పిస్తున్నారు అంటూ వారికి తన మద్దతు తెలిపాడు.

Scroll to load tweet…

కేవలం తనను బయటి వ్యక్తిగా చూస్తూ పార్టీలకు ఆహ్వానించకపోవటం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని చెపుతున్నారు. మరి లక్షలాది మంది వలస కార్మికులు చెప్పులు లేకుండా ఖాళీ కడుపులతో వేల మైళ్లు నడుస్తున్నారు. వాళ్లు ఎన్ని సార్లు ఆత్మహత్య చేసుకోవాలి. వర్మ కామెంట్‌తో నెపోటిజం వివాదం మరో టర్న్ తీసుకుంది. సుశాంత్ సింగ్ ఆదివారం ఉదయం తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన మరణంతో బాలీవుడ్ సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కి పడింది.

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…