దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మట్టిలో మరో మట్టిలో మాణిక్యాణ్ణి తెరపైకి తెచ్చాడు. సోషల్ మీడియా సెన్సేషన్ తో మూవీ ప్రకటించారు.  

రామ్ గోపాల్ వర్మ ఆ మధ్య ఒక అమ్మాయి ఫోటోలకు ఫిదా అయ్యాడు. చీర కట్టులో అలరిస్తున్న ఆమె ఎవరో చెప్పాలంటూ రిక్వెస్ట్ చేశాడు. ఎట్టకేలకు వివరాలు సంపాదించాడు. కేరళకు చెందిన ఆ అమ్మాయి పేరు శ్రీలక్ష్మీ సతీష్. సోషల్ మీడియా వేదికగా ఆమెకు సినిమా ఆఫర్ చేశాడు. మీకు ఇష్టం ఉంటే నా సినిమాలో నటించండి. హీరోయిన్ ని చేస్తా అని హామీ ఇచ్చాడు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వర్మ దర్శకత్వంలో నటించేందుకు శ్రీలక్ష్మి సతీష్ ఒప్పుకున్నారు. నేడు శ్రీలక్ష్మి సతీష్ హీరోయిన్ గా మూవీ ప్రకటించారు. ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ విడుదల చేశారు. ఈ చిత్రానికి శారీ అనే టైటిల్ నిర్ణయించారు. శారీ ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ అని వర్మ తెలియజేశాడు. నేడు ఇంటర్నేషనల్ శారీ డే. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేసినల్టు తెలియజేశాడు. 

వర్మ చేతిలో పడిన శ్రీలక్ష్మి సతీష్ కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. ప్రస్తుతం వర్మ వ్యూహం టైటిల్ తో చిత్రం చేస్తున్నారు. ఇది పొలిటికల్ డ్రామా. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుంది. వ్యూహం సీక్వెల్ శబధం విడుదల కానుంది. వ్యూహం సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. డిసెంబర్ 29న విడుదల కానుంది. 

View post on Instagram