రాజమౌళి కొడుకు నిశ్చితార్ధం.. అమ్మాయి ఎవరో తెలుసా..?

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 6, Sep 2018, 10:42 AM IST
Director Rajamouli's Son Karthikeya Gets Engaged
Highlights

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్న రాజమౌళి మరోపక్క తన కొడుకు పెళ్లి పనులు కూడా మొదలుపెట్టాడు

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్న రాజమౌళి మరోపక్క తన కొడుకు పెళ్లి పనులు కూడా మొదలుపెట్టాడు.

రాజమౌళి తనయుడు కార్తికేయ.. తండ్రి చిత్రాలకు లైన్ ప్రొడ్యూసర్ గా, సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా పని చేస్తూ కొన్ని సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేస్తుంటాడు. కొన్నాళ్లుగా అతడు గాయని పూజా ప్రసాద్ ను ప్రేమిస్తున్నాడు. ఇరు కుటుంబ సభ్యులు తమ ప్రేమకు అంగీకరించడంతో నిశ్చితార్ధం జరుపుకున్నారు.

ఇంతకీ ఈ పూజా ప్రసాద్ ఎవరో తెలుసా..? నటుడు జగపతి బాబు అన్న రామ్ ప్రసాద్ కుమార్తె.. వీరి నిశ్చితార్ధానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ, అఖిల్ వంటి తారలు వీరి ఎంగేజ్మెంట్ లో సందడి చేశారు. అయితే పెళ్లి ఎప్పుడు అనే విషయాలు ఇంకా తెలియాల్సివున్నాయి!

 

loader