Asianet News TeluguAsianet News Telugu

గేటు దగ్గర ఆకలితో ఉన్న వీధి కుక్కలు, దేశానికి మంచిది కాదు, వైరల్ గా రాజమౌళి ట్వీట్

రాజమౌళి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో నెలకొన్న కొన్ని దుర్భర పరిస్థితులను తన ట్వీట్ ద్వారా తెలియజేయడంతో పాటు, భారతదేశ ప్రతిష్ట కోసం వాటిపై దృష్టి పెట్టాలని కోరారు. రాజమౌళి ట్వీట్ వైరల్ గా మారగా, నెటిజెన్స్ తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. 
 

director rajamouli request to delhi airport authorities his tweet getting viral ksr
Author
Hyderabad, First Published Jul 2, 2021, 10:30 AM IST

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ సామాజిక అంశంపై స్పందించారు.  ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో నెలకొన్న కొన్ని దుర్భర పరిస్థితులను తన ట్వీట్ ద్వారా తెలియజేయడంతో పాటు, భారతదేశ ప్రతిష్ట కోసం వాటిపై దృష్టి పెట్టాలని కోరారు. రాజమౌళి ట్వీట్ వైరల్ గా మారగా, నెటిజెన్స్ తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. 


రాజమౌళి తన ట్వీట్ లో... డియర్ ఢిల్లీ ఎయిర్ పోర్ట్, నేను లుఫ్తానస ఎయిర్ వేస్ లో రాత్రి ఒకటి సమయంలో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కి వచ్చాను. ఆర్ టి, పీసీఆర్ టెస్ట్స్ కోసం ఫిల్ చేయమని కొన్ని ఫార్మ్స్ ఇచ్చారు. ఫార్మ్స్ ఎలా నింపాలో తెలిపే గైడ్ లైన్స్ కోసం ఎయిర్ పోర్ట్ గోడలవైపు చూడడం జరిగింది. కానీ ఎక్కడా అలాంటి సమాచారం లేదు. ఈ సమాచారం ఇవ్వడం చిన్న పని. 


ఇక ఎగ్జిట్ గేటు దగ్గర ఆకలిగా ఉన్న వీధి కుక్కలు గుంపులుగా ఉన్నాయి. విదేశాల నుండి వచ్చిన పాశ్చాత్యులకు ఇలాంటి దృశ్యాలతో స్వాగతం పలకడం దేశ గౌరవానికి అంత మంచిది కాదు. దయచేసి ఈ విషయాలపై దృష్టి పెట్టగలరు.. అంటూ కామెంట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో కూడా ఇలాంటి దుర్భర పరిస్థితులు నెలకొని ఉండడం నిజంగా విచారించాల్సిన విషయమే. 


మరో వైపు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న ఆర్ ఆర్ ఆర్ చివరి షెడ్యూల్ త్వరలో పూర్తి కానుంది. దీనితో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుందని సమాచారం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios